ఉద్యోగుల ఆందోళనలపైనా జగన్ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు మంచి జరగాలని సర్వీస్‌ పెంచామని.. పీఆర్సీ (prc) అమలు సహా, ఉద్యోగుల కోసం ప్రకటనలు చేశామన్నారు. జూన్‌ 30లోగా కారుణ్య నియామకాలు చేయాలని... యుద్ధ ప్రాతిపదికన కారుణ్య నియామకాలు ఇవ్వాలని జగన్ ఆదేశించారు.

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ (village secretariat employees) ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ (ys jagan) గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. జూన్‌ 30వ తేదీ కల్లా ఈ ప్రక్రియ పూర్తి కావాలని.. జులై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. మిగిలిన 25శాతం ఉద్యోగులు ప్రొబేషన్‌ పరీక్షలు కూడా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మార్చి మొదటి వారంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జగన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

అదే సమయంలో ఉద్యోగుల ఆందోళనలపైనా జగన్ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు మంచి జరగాలని సర్వీస్‌ పెంచామని.. పీఆర్సీ (prc) అమలు సహా, ఉద్యోగుల కోసం ప్రకటనలు చేశామన్నారు. జూన్‌ 30లోగా కారుణ్య నియామకాలు చేయాలని... యుద్ధ ప్రాతిపదికన కారుణ్య నియామకాలు ఇవ్వాలని జగన్ ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఖాళీలను వినియోగించుకోవాలని.. జగనన్న స్మార్ట్‌టౌన్‌షిప్స్‌లో రిబేటుపై స్థలాలు కేటాయించామని సీఎం గుర్తుచేశారు. 10 శాతం స్థలాలను 20 శాతం రిబేటుపై కేటాయించామని.. స్థలాల కేటాయింపునకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభించాలని జగన్ ఆదేశించారు. స్థలాలు కోరుతున్న ఉద్యోగుల పేర్లను మార్చి 5లోగా రిజిస్ట్రేషన్‌ చేయాలన్నారు. దానికొచ్చిన డిమాండ్ బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని.. సేకరించిన స్థలంలో 5 శాతం స్థలాలు పెన్షనర్లకు రిజర్వ్‌ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలి అని సీఎం జగన్‌ అన్నారు. 

మరోవైపు విజయవాడ పోలీస్ కమీషనర్ కాంత్రి రాణా టాటాని పీఆర్సీ సాధన సమితి నేతలు బుధవారం కలిశారు. కోవిడ్ కారణంగా తాము అనుమతి నిరాకరించామని సీపీ పేర్కొన్నారు. నిన్నటి నుంచే విజయవాడలో కూడా హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారని.. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు పీఆర్సీ సాధన సమితి నేతలు. చలో విజయవాడకు అనుమతి ఇవ్వాలని వారు కోరారు. 

పీఆర్సీ విషయంగా రాష్ట్ర ప్రభుత్వం- ఉద్యోగ సంఘాల మధ్య వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3న చలో విజయవాడకు పిలుపునిచ్చారు ఉద్యోగ సంఘాల నేతలు . అయితే దీనిని అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. విజయవాడ నగరంలో రేపు ఆంక్షలు విధించారు. ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. బీఆర్‌టీఎస్ రోడ్డులో సీసీ కెమెరాలతో పాటు డ్రోన్లతోనూ పోలీసులు నిఘా పెట్టారు.