Asianet News TeluguAsianet News Telugu

తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన జగన్

తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. మొత్తం 100 బస్సు సర్వీసులను అలిపిరి డిపో కేంద్రంగా నడిపించనున్నారు. వీటిలో 50 బస్సులను తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు సర్వీస్ కోసం కేటాయించారు. 

ap cm ys jagan inaugurates electric buses in tirumala
Author
First Published Sep 27, 2022, 7:30 PM IST

తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. అలిపిరి వద్ద జెండా ఊపి బస్సులను ప్రారంభించారు ముఖ్యమంత్రి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తొలిసారిగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతోంది ఏపీఎస్ఆర్టీసీ. మొత్తం 100 బస్సు సర్వీసులను నడిపించనున్నారు. అలిపిరి డిపో కేంద్రంగా వీటిని నడపనున్నారు అధికారులు. 50 బస్సులను తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు సర్వీస్ కోసం కేటాయించగా .. రేణిగుంట ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుమలకు 14 బస్సులు, తిరుపతి నుంచి మదనపల్లికి 12, తిరుపతి నుంచి నెల్లూరు, కడపలకు 12 సర్వీసులు కేటాయించారు. ఈ కార్యక్రమం ముగియగానే జగన్ తిరుమల కొండపైకి చేరుకుని బేడీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు. అంతకుముందు తిరుపతి శ్రీతాతయ్యగుంటలోని గంగమ్మ ఆలయాన్ని సందర్శించిన జగన్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చక స్వాములు సీఎంకు తీర్ధప్రసాదాలు అందజేశారు. 

ALso REad:బాబాయ్ హత్యతో సంబంధం లేదని శ్రీవారిపై ప్రమాణం చేస్తారా : జగన్‌‌కు లోకేష్ సవాల్

కాగా... రేపు ఉదయం సీఎం జగన్ స్వామి వారిని దర్శించుకుంటారు. తిరుమలలో పరకామణి భవనంతో పాటు లక్ష్మీవీపీఆర్ రెస్ట్ హౌస్ ను ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 8:45 గంటలకు సీఎం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి ఆయన ఓర్వకల్లు కు వెళ్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో  పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం ప్రయాణం చేసే మార్గంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios