ఆంధ్రప్రదేశ్ (ap secretariat) సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయ (hod office) ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan mohan reddy)  దసరా (dussehra) కానుక ప్రకటించారు. ఉచిత వసతి (free accommodation) సౌకర్యం పునరుద్ధరణకు జగన్ అంగీకారం తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ (ap secretariat) సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయ (hod office) ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) దసరా (dussehra) కానుక ప్రకటించారు. ఉచిత వసతి (free accommodation) సౌకర్యం పునరుద్ధరణకు జగన్ అంగీకారం తెలిపారు. ఉచిత వసతిని మరో ఆరు నెలల పాటు పొడిగించాలని సీఎం జగన్‌ను ఏపీ సచివాలయ ఉద్యోగుల కోరింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సచివాలయ సంఘం విజ్ఞప్తిని అంగీకరించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఉచిత వసతిని కొనసాగిస్తూ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను జగన్ ఆదేశించారు. ఉద్యోగులకు ఉచిత వసతిని ఎత్తేస్తూ గతంలో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

కాగా, తమ సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇటీవల ప్రభుత్వంతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత (ysrcp) సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy). రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో బుధవారం చర్చలు జరిపి అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వానికి శ్రద్ధ వుందని.. వారు లేనిపోని అపోహలు పెట్టుకోవద్దని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. 

కరోనా (coronavirus) తర్వాత రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఇబ్బందుల్లో పడిందని.. ఐఆర్ అమలులో కాస్త ఆలస్యం జరిగిందని.. ఈ నెలాఖరులో పీఆర్సీ అమలు చేస్తామని సజ్జల హామీ ఇచ్చారు. ఉద్యోగులు అడగకముందే ఐఆర్ ఇచ్చామని... వచ్చే నెలాఖరుకల్లా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపుతామని రామకృష్ణారెడ్డి వెల్లడించారు. జగన్‌ సీఎం అయ్యాక ఉద్యోగులకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. ప్రభుత్వ పథకాల అమలు ఉద్యోగుల భుజస్కంధాలపైనే ఉందని ఆయన గుర్తుచేశారు. జీతాలు ఇటీవల (late salaries) ఆలస్యమవుతున్న మాట వాస్తవమేనని అంగీకరించిన సజ్జల... ఉద్యోగ సంఘాలతో చర్చలు కొనసాగుతాయన్నారు. ఉద్యోగులను తన జట్టులో భాగంగానే సీఎం జగన్ భావిస్తారు అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 

ALso Read:నెలాఖరులోగా పీఆర్సీ అమలు.. ఇకపై ఒకటో తేదీనే జీతాలు : ఉద్యోగులకు సజ్జల హామీ

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటోన్న సమస్యలను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తెచ్చామన్నారు ఏపీజేఎసీ (apjac) ఛైర్మన్ బండి శ్రీనివాసులు (bandi srinivasulu). మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. మా సమస్యల పరిష్కారంపై సజ్జల సానుకూలంగా స్పందించారని చెప్పారు. రెండు రోజుల్లో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామని సజ్జల హామీ ఇచ్చారని... సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే సీఎస్ సమీర్ శర్మను (ap cs sameer sharma) కలిశామని శ్రీనివాసులు వెల్లడించారు. 

మరోవైపు దసరా కానుకగా ప్రభుత్వం పీఆర్సీ (prc) ఇస్తుందని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు ఆశిస్తున్నాయి. 12వ తేదీ వచ్చినా పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్లు రావడం లేదని.. ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకూ డబ్బులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా 1న వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరామని.. వైద్య ఆరోగ్య శాఖలో ప్రమోషన్లుపై (health department) సజ్జల సానుకూలత వ్యక్తం చేశారని శ్రీనివాసులు చెప్పారు. ప్రభుత్వానికి ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం.. ఇ ఇవ్వలేమని, తమపై ఉద్యోగుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయి అని బండి శ్రీనివాసులు మీడియాకు తెలిపారు.