Asianet News TeluguAsianet News Telugu

విగ్రహాల ధ్వంసం కేసు : పోలీస్ శాఖకు ఫుల్ పవర్స్.. సీఎం జగన్ కీలక నిర్ణయం...

ఆంధ్రప్రదేశ్ లో విగ్రహాల ధ్వంసం కేసులో పోలీసు శాఖకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయి అధికారులు ఇచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దేవుడి విగ్రహాలు ధ్వంసం చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వ్యక్తులు భయపడేలా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. 

ap cm ys jagan gives full powers to police department for action against idols demolish case - bsb
Author
Hyderabad, First Published Jan 6, 2021, 9:34 AM IST

ఆంధ్రప్రదేశ్ లో విగ్రహాల ధ్వంసం కేసులో పోలీసు శాఖకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయి అధికారులు ఇచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దేవుడి విగ్రహాలు ధ్వంసం చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వ్యక్తులు భయపడేలా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. 

మతాలు, కులాల మధ్య విద్వేషాలు పెంచేవారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని.. ఈ విషయంలో ఎవరినీ లెక్క చేయవద్దని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆలయాలపై దాడులు, ఇళ్ల స్థలాల పంపిణీ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశాలతో అర్ధరాత్రి ఆలయాల్లో విధ్వంసానికి పాల్పడుతున్నారని తెలిపారు. 

ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందిస్తుంటే జీర్ణించుకోలేక దొంగదెబ్బ తీయడానికి ఇలా కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దేవుడంటే భయం, భక్తి లేకుండా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని.. దీని ద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు రావాలనుకుంటున్నారని ఆక్షేపించారు. 
వీటన్నింటినీ జాగ్రత్తగా పర్యవేక్షించాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో సీసీ కెమెరాలు పెట్టే కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఇక, రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 20వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సీఎం జగన్‌ చెప్పారు. 

ఇప్పటి వరకు 39 శాతం ఇళ్ల స్థలాల పంపిణీ జరిగిందని లబ్ధిదారుడికి నేరుగా ఇంటి పట్టా అందిస్తున్నామని తెలిపారు. ఇళ్ల స్థలాల పెండింగ్‌ కేసులను కలెక్టర్లు పరిష్కరించాలని సీఎం ఆదేశించారు.

Follow Us:
Download App:
  • android
  • ios