ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద మనసును చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న సినీనటుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అభిమానికి ఆర్ధిక సాయం చేశారు. 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద మనసును చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న సినీనటుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అభిమానికి ఆర్ధిక సాయం చేశారు.

వివరాల్లోకి వెళితే... నాగేంద్ర అనే వ్యక్తి పవన్ వీరాభిమాని.. అతను ప్రస్తుతం రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అత్యవసర చికిత్స చేయించుకునే స్తోమత అతనికి లేకపోవడంతో సాయం చేయాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ట్వీట్ చేసింది.

పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై చలించిన సీఎం.. నాగేంద్ర వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 లక్షలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు సీఎంవో స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ ఆసుపత్రికి ఎల్‌వోసీని అందజేశారు. ముఖ్యమంత్రి సాయంతో పవన్ అభిమాని నాగేంద్రకు స్టెమ్ సెల్ థెరపి జరిగింది. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని సీఎంవో అధికారులు వెల్లడించారు. 

Scroll to load tweet…