అమరావతి అవినీతిలో చంద్రబాబుకు వాటా: ఏపీ అసెంబ్లీలో జగన్

ఏపీ అసెంబ్లీలో  జరిగిన   నిర్మాణాల్లో అవినీతి జరిగిందని  ఏపీ  సీఎం జగన్   ఆరోపించారు.  

AP CM YS Jagan Corruption alleges on Chandrababu over amaravathi constructions lns

అమరావతి: అమరావతిలో  జరిగిన నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందని  ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. శుక్రవారంనాడు ఏపీ అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ ప్రసంగించారు. 

షాపూర్ జీ పల్లంజీ  సంస్థ  ప్రతినిధి  మనోజ్వాసుదేవ్ పై  2019  నవంబర్ మాసంలో  ఐటీ సోదాలు  జరిగాయని  ఏపీ సీఎం వైఎస్ జగన్  చెప్పారు. అనంతరం  చంద్రబాబు పీఏ  శ్రీనివాస్ నివాసంలో కూడా ఐటీ దాడులు  జరిగాయని  సీఎం జగన్ గుర్తు  చేశారు.  2020  ఫిబ్రవరిలో  చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఇంట్లో  ఐటీ దాడులు జరిగాయని  వైఎస్ జగన్  చెప్పారు.  ఆతర్వాత చంద్రబాబుకు  ఐటీ శాఖ నోటీసులు  జారీ చేసిందని  జగన్  వివరించారు.  

చంద్రబాబు పీఏ శ్రీనివాస్, మనోజ్ తో డీల్  చర్చించారని  సీఎం జగన్ తెలిపారు.  బోగస్ కంపెనీలతో  నిధులను మళ్లించారని  ఆయన  ఆరోపించారు.   మనోజ్  దుబాయిలో  చంద్రబాబుకు  రూ. 15.14 కోట్లు  చెల్లించారని  తెలుస్తుందన్నారు.  రామోజీరావు  బంధువు  రఘు కు కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని  సీఎం జగన్  ఆరోపించారు.  

ప్రజా ధనాన్ని చంద్రబాబు తనకు  కావాల్సిన వారికి కట్టబెట్టారని  సీఎం జగన్  విమర్శించారు.  ఆర్వీఆర్ రఘు, కృష్ణ, నారాయణ సంస్థలకు నిధులను మళ్లించారని సీఎం జగన్  తెలిపారు. చివరగా ఈ నిధులన్నీ  చంద్రబాబుకు  చేరాయని సీఎం జగన్ వివరించారు. ఈ అంశాలన్నీ ఐటీ శాఖ నివేదికలో  ఉన్నాయని  ఏపీ సీఎం జగన్  తెలిపారు. ఏపీ  హైకోర్టు భవన నిర్మాణాల్లో  కూడా  అవినీతి జరిగిందని ఆయన  ఆరోపించారు.  

also read:ఏపీ సచివాలయ నిర్మాణంలో రూ.వేల కోట్ల గోల్‌మాల్, అవినీతిలో పీఏకూ భాగం : చంద్రబాబుపై మంత్రి అమర్‌నాథ్ ఆరోపణలు

 స్కిల్ డెవలప్ మెంట్ స్కీం ద్వారా  ఎలాంటి అవినీతికి పాల్పడ్డారో చూశామన్నారు జగన్ ఈ సందర్భంగా  ప్రస్తావించారు. అంతకుముందు ఇదే విషయమై  ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కూడా  ప్రసంగించారు.   చంద్రబాబు సర్కార్ అవినీతిలో  కూరుకుపోయిందని  ఆయన  విమర్శలు  చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios