మరోసారి మానవత్వం చాటుకున్న జగన్.. అంబులెన్స్‌కి దారి, వీడియో వైరల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (ap cm) వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. ఎనికేపాడు (enikepadu ) వద్ద ఒక అంబులెన్స్ సీఎం కాన్వాయ్ (jagan convoy)వెనుక వస్తుంది. దీనిని గమనించిన జగన్ అంబులెన్స్‌కు (ambulance) దారి ఇచ్చేందుకు తన కాన్వాయ్‌ని పక్కకు జరిపి నెమ్మదిగా వెళ్లాల్సిందిగా ఆదేశించారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (ap cm) వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. ఆదివారం గన్నవరం ఎయిర్‌పోర్టు (gannavaram airport) నుంచి తాడేపల్లి వెళ్తుండగా విజయవాడ (vijayawada) శివారు ఎనికేపాడు (enikepadu ) వద్ద ఒక అంబులెన్స్ సీఎం కాన్వాయ్ (jagan convoy)వెనుక వస్తుంది. దీనిని గమనించిన జగన్ అంబులెన్స్‌కు (ambulance) దారి ఇచ్చేందుకు తన కాన్వాయ్‌ని పక్కకు జరిపి నెమ్మదిగా వెళ్లాల్సిందిగా ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read:AP Floods: అసెంబ్లీకి రావొద్దు.. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఆదేశం
గతంలోనూ జగన్ అంబులెన్స్‌లకు దారి ఇచ్చిన ఘటనలు వున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఓదార్పు యాత్ర, పాదయాత్ర సమయాల్లోనూ తన మీటింగ్‌లను ఆపి మరీ ఆయన అంబులెన్స్‌లను పంపించారు. సీఎం అయిన తర్వాత కూడా కాన్వాయ్‌ని ఆపిన ఘటనలు ఎన్నో వున్నాయి. గతేడాది సెప్టెంబర్ 2న.. కడప జిల్లా పులివెందుల నుంచి తాడేపల్లి నివాసానికి వస్తున్న సమయంలో.. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి తాడేపల్లికి బయల్దేరారు. అదే సమయంలో గూడవల్లి- నిడమానూరు మధ్య రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. ఇది గమనించిన జగన్ అంబులెన్స్‌కి దారి ఇచ్చారు. ఈ వీడియో అప్పట్లో వైరల్ అవ్వడంతో పాటు జగన్‌పై ప్రశంసల వర్షం కురిసింది.
మరోవైపు భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ (ap floods) అల్లాడుతోన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పరిస్ధితిపై సీఎం జగన్ (ys jagan mohan reddy) అప్రమత్తమయ్యారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన ఆయన ఎప్పటికప్పుడు పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఇంఛార్జ్ మంత్రులు, ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు తక్షణ సహాయం అందేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని, తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వరద బాధితులకు అండగా నిలవాలని సీఎం ఆదేశించారు.
పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు, డ్రైనేజీల పూడికతీత పనులతో పాటు, వరద ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరుకుల పంపిణీ, జరిగిన నష్టంపై పక్కాగా అంచనాలు రూపొందించాలని సూచించారు. పంటలు పూర్తిగా దెబ్బతిన్న రైతులు.. తిరిగి పంటలు సాగు చేసేలా గతంలోనే ప్రకటించిన విధంగా వారికి విత్తనాలు, తదితరమైనవి అందేలా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని, సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు.
"