వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అభ్యర్ధుల విషయంలో సీఎం వైఎస్ జగన్ దూకుడుగా వెళ్తున్నారు. ఈ క్రమంలో కర్నూలు ఎంపీ అభ్యర్ధిగా మంత్రి గుమ్మనూరు జయరాంను ఎంపిక చేశారు. అలాగే ఆయన స్థానంలో ఆలూరు అసెంబ్లీ అభ్యర్ధిగా విరూపాక్షి అభ్యర్ధిత్వానికి జగన్ మోహన్ రెడ్డి ఆమోద ముద్ర వేశారు.

మరోవైపు.. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ వైసీపీకి రాజీనామా చేశారు. అలాగే తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. సంజీవ్‌ను ఇటీవల వైసీపీ అధిష్టానం.. కర్నూలు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తప్పించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అనుచరులు, కార్యకర్తలు, మద్ధతుదారులతో చర్చించిన తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.