చేసిన లబ్ది ప్రతి గడపకు చేరవేయాలి: ప్రజా ప్రతినిధులతో సీఎం జగన్

రాష్ట్ర ప్రభుత్వం  చేసిన లబ్దిని  ప్రతి గడపకు  చేరవేయాలని సీఎం జగన్  పార్టీ ప్రజా ప్రతినిధులను కోరారు. ఇవాళ  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో  సీఎం జగన్ భేటీ అయ్యారు.
 

AP CM  YS Jagan Conducts  meeting YSRCP MLAs in Tadepally


హైదరాబాద్:ప్రజలకు చేసిన  లబ్దిని ప్రతి గడపకు  చేరవేయాలని  ఏపీ సీఎం వైఎస్ జగన్  పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కోరారు. సోమవారం నాడు క్యాంప్ కార్యాలయంలో   పార్టీ ప్రజా ప్రతినిధులు, వైసీపీ జిల్లా అధ్యక్షులు,  రీజినల్ కో ఆర్డినేటర్లలతో   సీఎం జగన్  సమావేశమయ్యారు.  నువ్వే  మా భవిష్యత్తు జగనన్న  అనే క్యాంపెయిన్  పై  సీఎం జగన్ ప్రజెంటేషన్  ఇచ్చారు.కృష్ణా, గుంటూరు జిల్లాల్లో  మినహ  రాష్ట్రంలోని  ఇతర జిల్లాల్లో   ఎన్నికల కోడ్  అమల్లో  ఉంది. దీంతో  ఎన్నికల కోడ్  ఉల్లంఘనలు  లేకుండా  చూసుకోవాలని కూడా  పార్టీ నేతలకు  జగన్  సూచించారు. ఈ  ఏడాది  మార్చి  18వ తేదీ నుండి ఈ క్యాంపెయిన్ ను  నిర్వహించాలని  నిర్ణయం తీసుకున్నారని  సమాచారం.  ఈ క్యాంపెయిన్ కంటే  ముందే  గృహ సారధులు, పచివాలయ కన్వీనర్లకు శిక్షణ నిర్వహించనున్నారు.    

మరోవైపు గడప గడపకు మన ప్రభుత్వంపై  ప్రజా ప్రతినిధుల  పనితీరును జగన్ సమీక్షించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోని  ప్రజా ప్రతినిధులకు సీఎం జగన్ క్లాస్ తీసుకున్నారని  సమాచారం.  ఒక్క రోజూ కూడా  గడప గడపకు మన ప్రభుత్వం  కార్యక్రమం  నిర్వహించని ఎమ్మెల్యేలు  మూడు లేదా  నలుగురు  ఉన్నారు.

మరో వైపు మూడు, నాలుగు రోజులకు  కొందరు ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ దఫా కూడా  సుమారు  30 మంది  ప్రజా ప్రతినిధుల పనితీరు సరిగా లేదని సీఎం జగన్  వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది.  34  రోజులకు  ఎమ్మెల్యేలు  గడప గడపకు కార్యక్రమానికి  పరిమితమైనట్టుగా   సీఎం జగన్  కు నివేదిక అందింది,.  గడప గడపకు  మన ప్రభుత్వం కార్యక్రమాన్ని  సీరియస్ గా తీసుకోని  ఎమ్మెల్యేల  పేర్లను  సీఎం జగన్ ఈ సమావేశంలో చదివి విన్పించారు.

స్థానిక సంస్థల  ఎమ్మెల్సీ  ఎన్నికల్లో విజయం సాధిస్తామని  సీఎం జగన్  ధీమాను వ్యక్తం  చేశారు. టీచర్స్, గ్రాడ్యుయేట్స్  ఎమ్మెల్సీ  ఎన్నికల్లో  విజయం సాధించాలని  సీఎం  చెప్పారు.

మార్చి  18 నుండి  26 వరకు  జగనన్న కార్యక్రమం  క్యాంపెయిన్   నిర్వహించనున్నారు.  గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, జగన్ సర్కార్  కార్యక్రమాల గురించి  ప్రజలకు  వివరించనున్నారు.  జగన్  సర్కార్  ఏ రకంగా  గత ప్రభుత్వం కంటే  మెరుగ్గా పనిచేసిందనే విషయాలని  వివరిస్తారు. సచివాలయ కన్వీనర్లు గృహ సారధులను కో ఆర్డి నేట్ చేయాలని  సీఎం  సూచించారు. రాష్ట్రంలోని  7,417 సచివాలయాల పరిధిలో  గడప గడపకు మన ప్రభుత్వం  కార్యక్రమాన్ని నిర్వహించినట్టుగా ఈ సమావేశంలో  సీఎం  ప్రకటించారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios