కోవిడ్‌తో చనిపోయిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం అధికారులను ఆదేశించారు

కోవిడ్‌తో చనిపోయిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు జగన్ సర్కార్ భరోసా కల్పించింది. ఈ మేరకు కారుణ్య నియామకాలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఖాళీలు, రోస్టర్ పాయింట్లతో సంబంధం లేకుండా నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.