ఈ నెల 18న జగనన్న తోడు పథకం కింద నిధులు: పవన్ పై మంత్రి వేణుగోపాల్ ఫైర్

ఈ నెల  21న  నేతన్న నేస్తం కింద లబ్దిదారులకు  నిధులను జమ చేయనున్నట్టుగా  మంత్రి  వేణుగోపాల్  తెలిపారు.ఏపీ కేబినెట్ సమావేశ నిర్ణయాలను మంత్రి  వివరించారు.

AP CM To Release Jagananna  thodu Funds on July 18 Says Minister  Venugopal lns

హైదరాబాద్:ఈ నెల  18న  జగనన్న తోడు పథకం కింద నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని  ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ తెలిపారు. ఏపీ కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను  మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మీడియాకు వివరించారు.  బుధవారంనాడు ఏపీ సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  జూలై నెలలో  చేపట్టనున్న పలు సంక్షేమ కార్యక్రమాలకు  కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు.

ఈ నెల  20న  సీఆర్‌డీఏ  ప్రాంతంలో  ఇళ్ల నిర్మాణ పనుల ప్రారంభానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని  మంత్రి వివరించారు. ఈ నెల  21న  నేతన్న నేస్తం కింద లబ్దిదారులకు  నిధులను జమ చేయనున్నట్టుగా  మంత్రి  వేణుగోపాల్  తెలిపారు. ఈ నెల  26న  సున్నా వడ్డీ కింద డ్వాక్రా మహిళలకు  ప్రభుత్వం  నిధులను జమ చేయనుందని  మంత్రి చెప్పారు. భూమిలేని పేదలకు  ఇచ్చిన భూమిపై  ఇచ్చిన ఆంక్షలను  కేబినెట్ ఎత్తివేసిందని మంత్రి తెలిపారు. 

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ది సంస్థను ఏర్పాటు చేసేందుకు  కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చప్పారు. జేఎన్‌టీయూ కాకినాడ కాలేజీలో  27  సిబ్బంది నియామకం కోసం కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. యూనివర్శిటీల్లో  బోధన సిబ్బంది కొరత తీర్చేందుకు  ఉద్యోగుల వయస్సు పరిమితిని పెంచుతూ  నిర్ణయం తీసుకున్నట్టుగా మంత్రి తెలిపారు.

పవన్ కళ్యాణ్ పై  మంత్రి వేణుగోపాల్ ఫైర్

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను  చంద్రబాబు రెండు జిల్లాలకు పరిమితం చేశాడన్నారు. మహిళల మిస్సింగ్ కేసులన్నీ మానవ అక్రమ రవాణా కిందకు వస్తాయా అని మంత్రి ప్రశ్నించారు.  పవన్ కళ్యాణ్ ను ట్రాప్  చేసి వాలంటీర్లపై  చంద్రబాబు మాట్లాడించారని  మంత్రి విమర్శించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios