అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం జగన్‌ మంగళవారం నాడు లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆ లేఖలో కోరారు. ఈ విషయమై మాట్లాడేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని ఆ లేఖలో ప్రధానిని ఆయన కోరారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై స్వయంగా కలిసి సమస్యను వివరించేందుకు అవకాశం ఇవ్వాలని ఆ లేఖలో జగన్ కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పునరాలోచన చేయాలని ఆ లేఖలో  మోడీని జగన్ కోరారు.

 

అఖిలపక్షంతో కలిసి వచ్చి ఈ విషయమై మాట్లాడుతానని ఆ లేఖలో జగన్ కోరారు. అఖిలపక్షం నేతలతో పాటు, కార్మిక సంఘ నేతలను తీసుకొస్తానని  ఆ లేఖలో జగన్ లేఖలో పేర్కొన్నారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. విశాఖ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం సోమవారం నాడు స్పష్టం చేసింది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  సోమవారం నాడు విశాఖ ఎంపీకి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.గతంలో మోడీకి రాసిన లేఖలో ప్రైవేటీకరణ చేయకుండా ప్రత్యామ్నాయ సూచనలను జగన్ సూచించారు.