Asianet News TeluguAsianet News Telugu

మోడీకి జగన్ లేఖ: 60 లక్షల కరోనా టీకాలు అందించాలని లేఖ

ప్రధానమంత్రి నరేంద్రమోడీకీ ఏపీ సీఎం జగన్  శుక్రవారంనాడు లేఖ రాశాడు.  రాష్ట్రానికి  మరో 60 లక్షల వ్యాక్సిన్లు ఇవ్వాలని ఆ లేఖలో మోడీని కోరారు.

AP CM Jagan writes letter to PM modi over covid vaccine lns
Author
Guntur, First Published Apr 16, 2021, 4:34 PM IST

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోడీకీ ఏపీ సీఎం జగన్  శుక్రవారంనాడు లేఖ రాశాడు.  రాష్ట్రానికి  మరో 60 లక్షల వ్యాక్సిన్లు ఇవ్వాలని ఆ లేఖలో మోడీని కోరారు.రాష్ట్రంలో  కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నామని  ఆయన తెలిపారు.  టీకా ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించినట్టుగా ఆ లేఖలో పేర్కొన్నారు. ఒక్క రోజులోనే  6.28 లక్ష డోసుల వ్యాక్సిన్లు వేసిన విషయాన్ని ఆయన ఆ లేఖలో గుర్తు చేశారు.

 మొదటి డోసు వేసుకొన్న 45 ఏళ్లు  పై బడినవారికి మరో మూడు వారాల్లో రెండో డోస్ ఇవ్వాల్సి ఉందని ఆయన ఆ లేఖలో గుర్తు చేశారు. టీకా ఉత్సవానికి రాష్ట్రానికి 6 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు  అందించినందకు ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.  రాష్ట్రంలో  కరోనా టీకాల కొరత నెలకొంది.  ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయానికి సుమారు 5 లక్షల  కరోనా వ్యాక్సిన్ డోసులు రానున్నాయి. 

ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.  ఈ కేసుల వ్యాప్తిని తగ్గించేందుకు గాను  ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటుంది.   కరోనాపై  గురువారం నాడు సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.   ఫోన్ చేసిన మూడు గంటల్లోనే కరోనా రోగులకు బెడ్స్ అందించాలని సీఎం ఆదేశించిన విషయం తెలిసిందిే.
 

Follow Us:
Download App:
  • android
  • ios