అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు  గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకొని వివిధ అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్‌ గవర్నర్‌తో భేటీ అయ్యారని సమాచారం.

ఈ నెల 11వ తేదీ నుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.  ఈ నెల 12వ తేదీన  ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 

ఈ నేపథ్యంలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్‌ ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ తదితర అంశాలపై సీఎం జగన్ గవర్నర్‌తో చర్చించినట్టు సమాచారం.