విశాఖకు బయలుదేరిన ఏపీ సీఎం జగన్: జీ-20 ప్రతినిధులతో భేటీ

ఏపీ సీఎం వైఎస్ జగన్  విశాఖకు  బయలుదేరి వెళ్లారు.  ఇవాళ  రాత్రికి  జీ20  ప్రతినిధులతో   జగన్  భేటీ కానున్నారు.

 AP CM Jagan   leaves for  Visakhapatnam    lns

అమరావతి: ఏపీ సీఎం జగన్  మంగళవారంనాడు సాయంత్రం  విశాఖపట్టణానికి  బయలుదేరారు.   గన్నవరం ఎయిర్ పోర్టు  నుండి  ఏపీ సీఎం వైఎస్ జగన్ .విశాఖపట్టణం  బయలుదేరారు. ఇవాళ  రాత్రి  విశాఖపట్టణంలో  జీ -20  ప్రతినిధులతో  ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు.  

ఆంధ్రప్ర,దేశ్ ముఖ్యమంత్రి  విశాఖలో  జరిగే  జీ20  ప్రతినిధులు సదస్సులో  పాల్గొనేందుకు  గన్నవరం నుండి  విశాఖపట్టణం బయలుదేరి వెళ్లారు. జీ20 దేశాలకు చెందిన  ప్రతినిధులు  పాల్గొనే  ఈ సదస్సులో  ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా  వసతి  సౌకర్యాలను  ఏర్పాటు  చేసింది. జీ 20 సదస్సులో పాల్గొనే   ప్రతినిధులతో  కలిసి  సీఎం జగన్  భోజనం చేస్తారు. అనంతరం  అక్కడి నుండి  జగన్  తిరిగి  తాడేపల్లి  చేరుకుటారు. 

విశాఖపట్టణం  వేదికగా  రాష్ట్రప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ నెల  3,4 తేదీల్లో  విశాఖపట్టణంలో  గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్  నిర్వహించారు.  ప్రపంచంలోని  పలు దేశాల  నుండి  పలువురు  ప్రతినిధులు ఈ సమ్మిట్ కు హాజరయ్యారు.   ఈ సమ్మిట్ ద్వారా  పెద్ద ఎత్తున  పెట్టుబడులు  పెట్టేందుకు  పలు సంస్థలు  ముందుకు  వచ్చినట్టుగా  రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.  

విశాఖపట్టణం నుండి  పాలనను సాగించనున్నట్టుగా  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్  మరోసారి ప్రకటించారు.  గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో  వశాఖపట్టణాన్ని  పరిపాలన రాజధానిగా మారనుందని సీఎం జగన్  ప్రకటించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios