అమరావతి: చంద్రబాబు ఎక్కడుంటే అక్కడ దిగజారిన రాజకీయం ఉంటుందని  ఏపీ సీఎం వైఎస్ జగన్  మాజీ సీఎం చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు  చేశారుపోలవరం ప్రాజెక్టుపై జరిగిన చర్చలో  ఏపీ సీఎం జగన్ ప్రసంగించారు. ..1999 నుండి 2004 వరకు కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకొనే రోజుల్లోనే పోలవరం ప్రాజెక్టు గురించి చంద్రబాబు పట్టించుకోలేదని ఆయన ఎద్దేవాచేశారు.

 పోలవరంపై చర్చ జరగకుండా ఉద్దేశ్యపూర్వకంగా టీడీపీ సభ్యులు అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు.చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో 14 శాతం పనులను మాత్రమే పూర్తి చేసిందన్నారు. టీడీపీ ప్రభుత్వం 10 వేల 627 ఎకరాల ఎకరాలను మాత్రమే సేకరించారన్నారు.

also read:పోలవరంపై చర్చ: ఏపీ అసెంబ్లీ నుండి 9 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

పోలవరం ఎడమ ప్రధాన కాల్వకు కేవలం 0.89 శాతం భూసేకరణ చేశారన్నారు. వైఎస్ హాయంలో కుడి కాల్వ పూర్తి కాకపోతే  పట్టిసీమ ప్రాజెక్టు ఎలా వచ్చేదని ఆయన ప్రశ్నించారు.
ఎడమ కాలువ కింద వైఎస్ 80 శాతం భూసేకరణ జరిపారన్నారు. 2019 నాటికి కేవలం 39 శాతం పనులు మాత్రమే జరిగినట్టుగా ఆయన గుర్తు చేశారు. 

పోలవరాన్ని ఏటీఎంలా మార్చేశారని ప్రధాని మోడీ చేసిన విమర్శలను జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.  పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 1343 కోట్లను ఆదా చేశామని సీఎం చెప్పారు.

పోలవరం .ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు.ప్రత్యేక ప్యాకేజీ పేరుతో చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారు. ప్రత్యేక ప్యాకేజీ అద్భుతమని ప్రశంసించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

2016 సెప్టెంబర్ 7వ తేదీన రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారన్నారు. 2014 అంచనాలకే కేంద్రం నిధులు ఇస్తానని చెప్పిందని జగన్ గుర్తు చేశారు.తాము ప్రతిపక్షంలో ఉండగానే ఈ  అంశాలను ప్రశ్నిస్తే చంద్రబాబునాయుడు బుల్డోజ్ చేశారని ఆయన ఆరోపించారు.

దేవుడి దయతో కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తోందన్నారు. ఏ ప్రాజెక్టుకైనా ప్రతి మూడేళ్లకోసారి అంచనాలు మారుతుంటాయని ఆయన చెప్పారు. ఇవన్నీ తెలిసి కూడ చంద్రబాబు పాత అంచనాలకే ఒప్పుకొన్నారని జగన్ విమర్శించారు.

చంద్రబాబు సర్కార్ చేసిన పెంటను క్లియర్ చేస్తూ  ముందుకు వెళ్తున్నామన్నారు.