అమరావతి: ఏపీ అసెంబ్లీ నుండి మూడో రోజున 9 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ప్రసంగిస్తున్న సమయంలో స్పీకర్ పోడియం వద్ద ఆందోళన కొనసాగిస్తున్న  9 మందిని సభ నుండి సస్పెండ్ చేశారు.

వరుసగా మూడు రోజుల నుండి టీడీపీ సభ్యులను సభ నుండి సస్పెండ్ చేశారు. చంద్రబాబునాయుడు మినహా 9 మంది ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేశారు.పోలవరంపై ఏపీ సీఎం జగన్ సమాధానం చెబుతున్న సమయంలో స్పీకర్ పోడియం వద్దే ఉండి ప్రసంగానికి అడ్డుపడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలను ఇవాళ ఒక్క రోజు పాటు సభ నుండి సస్పెండ్ చేశారు.

వరుసుగా మూడు రోజులుగా టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు.నవంబర్ 30వ తేదీన రైతుల సమస్యలపై  చంద్రబాబు సహా టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో చంద్రబాబునాయుడు సహా టీడీపీకి చెందిన  16 మంది ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేశారు.

డిసెంబర్ 1వ తేదీన టిడ్కో ఇళ్ల సమస్యలపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ విషయమై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీ వేడీ చర్చ సాగింది.డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం చంద్రబాబు మినహా 15 మంది ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేశారు. అదే రోజు ఉదయం టీడీపీ శాసనససభపక్ష ఉప నాయకుడు నిమ్మల రామానాయుడును సస్పెండ్ చేశారు.

పోలవరం పై బుధవారం నాడు ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా చంద్రబాబుకు మాట్లాడే అవకాశం కల్పించాలని కోరుతూ నిరసనకు దిగిన 9 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.