చంద్రబాబు షాకింగ్ నిర్ణయం..

ap cm chandrababu shocking decission on patry leaders
Highlights

ఆ నేతలందరినీ పార్టీ నుంచి తొలగించనున్న చంద్రబాబు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు.  రానున్న ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కించుకునేందుకు టీడీపీ నానా అవస్థలు పడుతోంది. మరోవైపు ఈసారైనా అధికారంలోకి రావాలని వైసీపీ అధినేత జగన్ కూడా తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన పాదయాత్ర కూడా చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. రాష్ట్రానికి హోదా కోసం ఉద్యమం చేసిన ఘనత తమ పార్టీకే దక్కాలని కూడా ఇరు పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారు.  నేపథ్యంలో తాజాగా చంద్రబాబు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా పార్టీ నేతలకు కొన్ని హెచ్చరికలు జారీ చేశారు.

ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండాలని హెచ్చరించారు. ప్రత్యేకించి ఇసుక, మద్యం బెల్టు షాపుల వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. ఆశించిన స్థాయిలో పని చేయలేమని అనుకుంటే ముందే చెప్పి తప్పుకోవాలని సూటిగా చెప్పారు. ఎవరైనా సరే పార్టీకి చెడ్డపేరు తెస్తారనే భావన కలిగితే.. వారందరినీ పార్టీ నుంచి స్వయంగా తాను తొలగిస్తానని చెప్పడం గమనార్హం.  ఇప్పటికే.. పార్టీ నేతలు చేస్తున్న తప్పులకు తాను బాధ్యత వహించనని చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తాజా నిర్ణయంతో చాలా మంది పార్ట నేతల్లో గుబులు మొదలైందని సమాచారం. 

loader