ఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తాము బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని తమ పోరాటానికి ఏ పార్టీ మద్దతు ఇచ్చినా తాము స్వాగతిస్తున్నట్లు తెలిపారు. 

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల పర్యటన నేపథ్యంలో మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. తొలుత ఈ అంశంపై మాట్లాడే సమయం కాదన్న చంద్రబాబు అనంతరం తాము బీజేపీపై పోరాటం చేస్తున్నామని తమతో  కలిసి పోరాటం చేసేందుకు ఏ పార్టీ కలిసి వచ్చినా స్వాగతిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.  

ఇకపోతే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా తెలంగాణ సీఎం వివిధ రాష్ట్రాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా కేరళ సీఎం పినరయి విజయన్ ను కలిసిన విషయం తెలిసిందే.