తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి ఫైరయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇవాళ అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న ఆయన హైదరాబాద్‌ నిర్మాణం గురించి తనపై కేసీఆర్ సెటైర్లు వేస్తున్నారన్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి ఫైరయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇవాళ అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న ఆయన హైదరాబాద్‌ నిర్మాణం గురించి తనపై కేసీఆర్ సెటైర్లు వేస్తున్నారన్నారు.

హైదరాబాద్‌ను తాను కట్టలేదని కులీకుతుబ్‌షానే నిర్మించారని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దానని.. సైబరాబాద్‌ తన మానస పుత్రిక అని స్పష్టం చేశారు. నా జీవితంలో తాను సైబరాబాద్ కట్టానని గర్వంగా చెబుతానని మరి కేసీఆర్ ఎంతో కష్టపడి ఫాంహౌస్ కట్టారా అని ఆరోపించారు.

తాను జాతీయ స్థాయిలో పనిచేయాల్సిన అవసరం మళ్లీ వచ్చిందని.. కేవలం రాష్ట్రానికే పరిమితమవ్వడం భావ్యం కాదన్నారు ముఖ్యమంత్రి. దేశరాజకీయాలు.. దేశం, రాష్ట్ర భవిష్యుత్తులను నిర్ణయిస్తాయని చంద్రబాబు తెలిపారు.

అందుకే తాను పొలిటికల్ గవర్నెన్స్ దిశగా ముందుకెళ్తున్నామని వెల్లడించారు. ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని.. పరిపాలన, రాజకీయం రెండూ సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.

పోలవరం ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా గుర్తించిందన్నారు.. రాష్ట్రప్రభుత్వం ఇప్పటి వరకు రూ.16 వేల కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విజన్-2024 డాక్యుమెంట్‌ను తయారు చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు వివరించారు.