Asianet News TeluguAsianet News Telugu

పిల్లలకే పరీక్షలు, పొలిటీషియన్లకు కాదు: చంద్రబాబు

యువత ఓ విజన్ తో ముందుకు వెళ్లాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఒంగోలులో జ్ఞానభేరి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు ప్రతీ ఒక్కరూ విజన్ తో ముందుకు వెళ్లాలని తెలిపారు. దేశంలోని మహానుభావులు అంతా విజన్ తోనే ముందుకు వెళ్లారని గుర్త చేశారు. 
 

Ap cm chandrababu naidu participating in jnanabheri programme in prakasam
Author
Ongole, First Published Dec 12, 2018, 2:54 PM IST

హైదరాబాద్: యువత ఓ విజన్ తో ముందుకు వెళ్లాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఒంగోలులో జ్ఞానభేరి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు ప్రతీ ఒక్కరూ విజన్ తో ముందుకు వెళ్లాలని తెలిపారు. దేశంలోని మహానుభావులు అంతా విజన్ తోనే ముందుకు వెళ్లారని గుర్త చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దుతానని తెలిపారు. యువత విద్యారంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలని కోరారు. తెలుగుదేశం పార్టీ విద్యారంగానికి చేస్తున్న కృషిని చంద్రబాబు నాయుడు విద్యార్థులకు వివరించారు. 

జాతీయ స్థాయి ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టును విద్యార్థులంతా చూడాలని కోరారు. అన్ని యూనివర్శిటీలు విద్యార్థులను పోలవరం ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులు ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. 

అలాగే విద్యార్థులకు మాత్రమే పరీక్షలు ఉంటాయని పొలిటీషియన్లకు కాదని చంద్రబాబు తెలిపారు. అన్ని పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించి దేశానికి ఆదర్శవంతంగా విద్యార్థులు తయారుకావాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. 

మరోవైపు కేంద్రప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్రాన్ని ఎంతో అభివృధి చేశానని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీకి ప్రధాని మోదీ తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చెయ్యకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర సమస్యలపై ఢిల్లీకి 29సార్లు వెళ్లాలని తెలిపారు. 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో కేంద్రంపై టీడీపీ పోరాటబాటపట్టిందని చంద్రబాబు తెలిపారు. ఎప్పుడైతే కేంద్రంపై తిరుగుబాటుకు ప్రయత్నించామో ఆనాటి నుంచి కేంద్రం ఐటీ, ఈడీ, సీబీఐ దాడులకు దిగుతోందని ఆరోపించారు. 

ప్రధాని మోదీ దేశంలోని అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేశారని చంద్రబాబు ఆరోపించారు. సీబీఐ, ఆర్బీఐ, ఆఖరికి న్యాయవ్యవస్థలను కూడా వినాశనం చేస్తున్నారని ఆరోపించారు. మోదీ చేస్తున్న ప్రజావ్యతిరేక పాలనను తిప్పికొట్టేందుకు టీడీపీ పోరాటం చేస్తుందని తెలిపారు. అలాగే విద్యాసంస్థలు రాష్ట్రానికి ప్రకటించారు కానీ వాటికి నిధులు మాత్రం ఇవ్వలేదన్నారు. 

ప్రకాశం జిల్లాను ఇండస్ట్రీయల్ హబ్ గా తీర్చిదిద్దుతానని తెలిపారు. దోనకొండను ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్ గా మారుస్తానని ప్రకటించారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసేది తానేన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును కూడా తానే పూర్తి చేస్తానని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 

జాతీయ రహదారులు అత్యధికంగా ఉన్న జిల్లా ప్రకాశం జిల్లా అని కొనియాడారు. పోర్టు కూడా నిర్మిస్తామని తెలిపారు. అలాగే ప్రకాశం జిల్లాను కరువు రహిత జిల్లాగా తీర్చిదిద్దుతానని తెలిపారు. త్వరలోనే రైతులను ఆదుకునేందుకు ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తామన్నారు. కరువు వస్తే ధీటుగా ఎదుర్కొనేందుకు మైక్రో అగ్రికల్చర్ విధానానికి పాటుపడుతున్నట్లు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios