తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎవరో తలసాని ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తున్నారని... తలసానికి మంత్రి పదవి ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టానన్నారు.

ముసుగు రాజకీయాలు ఎందుకని, ముసుగు తీసి మోడీ, కేసీఆర్, జగన్ కలిసి పోటీ చేయాలని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తెలుగువారి దెబ్బ అంటే ఏంటో చూపిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఆస్తులున్న టీడీపీ నేతలను బెదిరించి, వైసీపీలో చేరాలని టీఆర్ఎస్ నేతలు వేధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.