ఎన్నికల అనంతరం మోదీ ఇంటికి వెళ్లడం ఖాయమని చెప్పుకొచ్చారు. ఓటమి భయంతో మోదీ కాంగ్రెస్ పార్టీపైనా, రాజీవ్ గాంధీపైనా విరుచుకుపడుతున్నారని ఆరోపించారు. 20 ఏళ్ల క్రితం జరిగిన ఘటన ఇప్పుడెందుకు గుర్తుకు వచ్చిందోనని నిలదీశారు. 

అమరావతి: భారత ప్రధాని నరేంద్రమోదీపై మరోసారి విరుచుకుపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రధాని నరేంద్రమోదీకి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. ప్రస్టేషన్ తో మోదీ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. 

అమరావతిలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఈసారి కేంద్రంలో బీజేపీ ఓడిపోవడం ఖాయమన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని శక్తులను ఏకం చేశామని చెప్పుకొచ్చారు. బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని రూపొందించామన్నారు. 

ఎన్నికల అనంతరం మోదీ ఇంటికి వెళ్లడం ఖాయమని చెప్పుకొచ్చారు. ఓటమి భయంతో మోదీ కాంగ్రెస్ పార్టీపైనా, రాజీవ్ గాంధీపైనా విరుచుకుపడుతున్నారని ఆరోపించారు. 20 ఏళ్ల క్రితం జరిగిన ఘటన ఇప్పుడెందుకు గుర్తుకు వచ్చిందోనని నిలదీశారు. ఈ ఐదేళ్లలో ప్రధానిగా దేశానికి ఏం చేశారరో మోదీ చెప్పాలని అంతేకానీ గతాన్ని తవ్వుతూ ఎన్నికల్లో గెలుపొందాలనుకోవడం అవివేకమంటూ విరుచుకుపడ్డారు.