తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు తీవ్ర నిరాశకు గురి చేశాయి. ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని ఆశించిన చంద్రబాబు ఆశలు ఆడియాశలు అయ్యాయి. కనీసం తన మేనకోడలు నందమూరి హరికృష్ణ తనయ నందమూరి సుహాసినిని గెలిపించుకుందామని ఆశపడ్డారు.
అమరావతి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు తీవ్ర నిరాశకు గురి చేశాయి. ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని ఆశించిన చంద్రబాబు ఆశలు ఆడియాశలు అయ్యాయి. కనీసం తన మేనకోడలు నందమూరి హరికృష్ణ తనయ నందమూరి సుహాసినిని గెలిపించుకుందామని ఆశపడ్డారు.
కానీ ఆ ఆశ కూడా నెరవేర్చలేదు ఓటరు దేవుడు. దీంతో చంద్రబాబు నాయుడు డీలా పడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఖంగుతిన్న చంద్రబాబు నాయుడు ఈనెల 13న విశాఖపర్యటనను రద్దు చేసుకున్నారు.
వాస్తవానికి ఈనెల 13న విశాఖలోని పెద్ద గంట్యాడలో మెడిటెక్ జోన్ ను జాతికి అంకితం చేయాల్సి ఉంది. అలాగే తగరపువలసలో ఐ - హబ్ కు శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఎన్నికల ఫలితాల ప్రభావంతో చంద్రబాబు విశాఖపర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం.
