నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందుడుగు పడింది. స్టార్టప్ ఏరియ్ ఫేస్‌ 1 దగ్గర వెల్‌కం గ్యాలరీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌ హాజరయ్యారు. ఏపీలో బిజినెస్ ప్రమోషన్‌కు వీలుగా గ్యాలరీ భవన నిర్మాణం జరగనుంది. లింగాయపాలెం స్టార్టప్ ఏరియాలో మొత్తం 50 ఎకరాల్లో రూ.44 కోట్లతో ఈ వెల్‌కమ్ గ్యాలరీని నిర్మించనున్నారు.