జూన్ 2 ఓ చీకటి రోజు, మరోసారి ఏపిని విభజించడానికి కేంద్రం కుట్ర పన్నుతోంది : చంద్రబాబు

ap cm chandrababu fires on central government in nava nirmana deeksha
Highlights

విజయవాడ నవనిర్మాణ దీక్షలో కేంద్ర ప్రభుత్వం పై  విరుచుకుపడ్డ చంద్రబాబు

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని హేతుబద్దత లేకుండా విభజించి కాంగ్రెస్ పార్టీ, హామీలిచ్చి తీర్చకుండా బిజెపి పార్టీ నమ్మక ద్యోహం చేశాయని ఎపి సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఇవాళ రాష్ట్రాన్ని విభజించిన రోజు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ బెంజి సర్కిల్ లో నవ నిర్మాణ దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ... 2014 సంవత్సరం జూన్ 2 రాష్ట్రానికి చీకటిరోజని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తోందని, రాష్ట్రానికి న్యాయం జరగాలని ఇటు రాష్ట్రంలోను, అటు డిల్లీలోను దీక్ష చేపట్టినట్లు చంద్రబాబు తెలిపారు. 

రాష్ట్ర విభనన ద్వారా అస్తులు తెలంగాణకు.. అప్పులు ఏపీకి ఇచ్చారని చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఏపీలో తొలి ఏడాది రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందన్నారు. సంక్షోభం, సమస్యల మధ్య ఏపీలో పాలన ప్రారంభమైందని సీఎం తెలిపారు. కష్టాలు, సమస్యలు తప్ప ఏపీకి ఏం ఇచ్చారని కేంద్రాన్ని ప్రశ్నించారు.  ఏం సంతోషం ఉందని వేడుకలు జరుపుకోవాలని చంద్రబాబు ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నేర్చవేర్చకుండా కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని అందువల్లే కేంద్రపై తిరుగుబాటు చేయాల్సి వస్తోందని అన్నారు. 
 
ఇతర ప్రాంతాలను నిధులిచ్చి అభివృద్ది చేస్తూ, ఎపికి మాత్రం ఇచ్చిన హాబీ ప్రకారం నిధులివ్వకుండా కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రూమ చూపిస్తోందని మండిపడ్డారు. అంతే కాదు కేంద్ర ప్రభుత్వానికి సహకరించడం లేదని ఏపీని విచ్చిన్నం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ సంకేతాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయని చంద్రబాబు అన్నారు. 
 

loader