ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన రద్దయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికలు రానుండటంతో పాటు పార్టీ కార్యక్రమాలు ఎక్కువగా ఉండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది.

మరోవైపు చంద్రబాబుకు బదులుగా మంత్రి నారా లోకేశ్ దావోస్ వెళతారని తెలుస్తోంది. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో లోకేశ్ పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులపై పారిశ్రామిక వేత్తలు, ఇతర ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇవ్వనున్నారు. లోకేశ్ వెంట మంత్రులు, అధికారుల బృందం లోకేశ్ వెళ్లే అవకాశం ఉంది.