Asianet News TeluguAsianet News Telugu

భారతి పే కేసు: టీడీపీ నేత చింతకాయల విజయ్ పాత్రుడికి ఏపీ సీఐడీనోటీసులు

మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి తనయుడు విజయ్ పాత్రుడికి ఏపీ సీఐడీ ఇవాళ నోటీసులు అందించారు.

AP CID Serves notice To TDP Leader Chintakayala Vijay Patrudu
Author
First Published Jan 20, 2023, 2:24 PM IST

విశాఖపట్టణం: మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి తనయుడు  చింతకాయల విజయ్ పాత్రుడికి  ఏపీ సీఐడీ పోలీసులు శుక్రవారం నాడు  41 ఏ సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు.  భారతి పే కేసులో  ఈ నెల  27న విచారణకు రావాలని విజయ్ పాత్రుడికి   సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.  నోటీసులు ఇచ్చేందుకు  వెళ్లిన  సీఐడీ అధికారులకు  విజయ్ పాత్రుడు  అందుబాటులో లేడని తెలిసింది. దీంతో  విజయ్ పాత్రుడి  తల్లికి  సీఐడీ అధికారులు నోటీసులు అందించారు. 

సోషల్ మీడియాలో  భారతి పే పేరుతో  చేసిన పోస్టింగ్ ల అంశానికి సంబంధించి   చింతకాయల విజయ్ పాత్రుడికి గతంలోనే  సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే .  ఆ సమయంలో  పోలీసులు వ్యవహరించిన తీరును  టీడీపీ తప్పుబట్టింది.ఈ విషయమై  విజయ్ పాత్రుడు హైకోర్టును ఆశ్రయించారు.  భారతి పే  పేరుతో  చేసిన పోస్టింగ్ ల అంశం వెనుక  ఐటీడీపీ  ఉందని  సీఐడీ పోలీసులు గత ఏడాది డిసెంబర్  మొదటి వారంలో ప్రకటించారు. ఐటీడీపీ వ్యవహరాలను  విజయ్ పాత్రుడు చూస్తున్నారని  సీఐడీ విభాగం  అప్పట్లో  వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. 

also read:అర్థరాత్రి దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడ్డారు.. కనీసం దుస్తులు మార్చుకోనివ్వకుండా లాక్కెళ్లారు: అయ్యన్న సతీమణి


   ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించుకున్నారనే విషయమై   ఫోర్జరీ డాక్యుమెంట్లను  సృష్టించారని  కూడా చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన ఇద్దరు కుమారులపై  కూడా  పోలీసులు గత ఏడాదిలో  కేసులు రనమోదు చేశారు. ఈ కేసును పురస్కరించుకొని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని  పోలీసులు అరెస్ట్  చేసిన తీరు పై టీడీపీ వర్గాలు తీవ్రంగా మండిపడ్డాయిఈ విషయమై  అయ్యన్నపాత్రుడు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా మరోవైపు భారతి పే  కేసు  అంశం తెరమీదికి వచ్చింది.  ఈ నెల  27 అమరావతిలో  తమ కార్యాలయానికి రావాలని  సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు

Follow Us:
Download App:
  • android
  • ios