మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ మేనేజర్లు, కీలక అధికారుల నివాసాల్లో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.
మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ మేనేజర్లు, కీలక అధికారుల నివాసాల్లో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సోదాలు సాగుతున్నాయి. చిట్ ఫండ్ చట్ట నిబంధనలను ఉల్లంఘించి నిధుల మళ్లింపు జరిగిందనే ఆరోపణలపై సీఐడీ అధికారులు ఈ సోదాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇందుక సంబంధించి విజయవాడ మార్గదర్శి మెయిన్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్‌ను సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఇక, కొన్ని నెలల కిందట మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ కార్యాలయాల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఇన్‌స్పెక్టర్ జనరల్ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 35 చిట్‌ఫండ్ కంపెనీల్లో మూడు దశల్లో నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు వెలుగుచూశాయని చెప్పారు.
అయితే ఈ విషయంలో కష్టమర్ల నుంచి ప్రత్యేకంగా కంప్లైంట్స్ రాలేదని ఐజీ రామకృష్ణ అన్నారు. కానీ మార్గదర్శి ఖాతాల మెయిటెంటెన్స్ సరిగా లేదని సమాచారం అందటంతో ఆడిట్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. మార్గదర్శి చిట్ ఫండ్స్‌పై శాఖ షోకాజ్ నోటీసు జారీ చేసి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తుందని కూడా చెప్పారు. ఇక, ఇందుకు సంబంధించి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి సీఐడికి అందిన ఫిర్యాదు మేరకు.. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది.
