అమరావతి అసైన్డ్ భూముల కేసు: సీఐడీ దూకుడు,సీఆర్డీఏ చైర్మెన్ విచారణ
అమరావతిలో అసైన్డ్ భూముల కేసులో సీఐడీ అధికారులు వేగం పెంచారు. ఇప్పటికే పలువురు అధికారుల నుండి సీఆర్డీఏ ఛైర్మెన్ శ్రీధర్ ను సీఐడీ అధికారులు శుక్రవారం నాడు విచారించారు.
అమరావతి: అమరావతిలో అసైన్డ్ భూముల కేసులో సీఐడీ అధికారులు వేగం పెంచారు. ఇప్పటికే పలువురు అధికారుల నుండి సీఆర్డీఏ ఛైర్మెన్ శ్రీధర్ ను సీఐడీ అధికారులు శుక్రవారం నాడు విచారించారు.
అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో అవకతవకలు చోటు చేసుకొన్నాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి గత మాసంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి పి. నారాయణలకు సీఐడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
మరో వైపు శుక్రవారం నాడు సీఆర్డీడీఏ చైర్మెన్ శ్రీధర్ ను సీఐడీ అధికారులు విచారించారు. అసైన్డ్ భూముల సమాచారాన్ని అధికారులు సేకరించారు.మరోసారి సీఐడీ అధికారులు శ్రీధర్ ను ఈ విషయమై విచారించే అవకాశం ఉంది. మరో వైపు ఇదే విషయమై మరికొందరు రైతులను కూడ సీఐడీ అధికారులు విచారించారు.