Asianet News TeluguAsianet News Telugu

ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇంటికి సీఐడీ అధికారులు: ఈ నెల 17న విచారణకు రావాలని నోటీసులు


వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు నోటీసులు ఇవ్వడానికి ఏపీ సీఐడీ పోలీసులు హైద్రాబాద్‌లోని రఘురామకృష్ణంరాజు ఇంటికి చేరుకొన్నారు. 

AP CID police reaches to Ycp MP Raghurama krishnam Raju house in Hyderabad
Author
Hyderabad, First Published Jan 12, 2022, 9:52 AM IST


హైదరాబాద్:  వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు   ఏపీ సీఐడీ పోలీసులు Raghurama krishnam Raju  ఇంటికి బుధవారం నాడు చేరుకొన్నారు. ఈ నెల 17న విచారణకు రావాలని ఆయనకు నోటీసులు ఇచ్చారు.

బుధవారం నాడు ఉదయం 8 గంటల సమయంలో ycp ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఏపీ Cid అధికారులు వచ్చారు. గతంలో నమోదు చేసిన కేసుల విషయమై విచారణకు హాజరు కావాలని notice ఇచ్చేందుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

 రఘురామకృష్ణంరాజు న్యూఢిల్లీ నుండి హైద్రాబాద్ లోని  తన ఇంటికి చేరుకొన్నారని వచ్చిన సమాచారం ఆధారంగా సీఐడీ అధికారులు హైద్రాబాద్‌ గచ్చిబౌలిలోని రఘురామకృష్ణంరాజు ఇంటికి వచ్చారని సమాచారం.  అయితే ఎంపీ రఘురామకృష్ణంరాజు కోసం సీఐడీ అధికారులు ఎదురు చూస్తున్నారు.  రఘు రామకృష్ణంరాజు ఇంటి నుండి బయలకు వచ్చిన తర్వాత నోటీసులు అందించాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు.

ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కల్గించేలా  మీడియాలో వ్యాఖ్యలు చేశారని  ఏపీ సీఐడీ అధికారులు 2021 మే 14న రఘురామకృష్ణంరాజును హైద్రాబాద్‌లోని గచ్చిబౌలిలో అరెస్ట్ చేశారు. ప్రభుత్వ  ప్రతిష్టకు భంగం కల్గించేలా వ్యవహరించారని 124-ఏ , ఐపీసీ  153 - బీసెక్షన్ కింద సీఐడీ కేసు నమోదుచేసింది. దీంతో పాటుగా ఐపీసీ సెక్షన్ 505 కింద బెదిరింపులకు పాల్పడటం, ఐపీసీ సెక్షన్ 120-B కింద దురుద్దేశపూర్వకంగా కుట్రకు పాల్పడ్డారనే అభియోగాల కింద రఘురామరాజుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది.  ఈ కేసులో  ఆయనను సీఐడీ అరెస్ట్ చేసింది.

తనపై నమోదైన కేసుల విషయమై పలు కోర్టుల్లో రఘురామకృష్ణంరాజు పిటిషన్లు దాఖలు చేశారు. చివరకు ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు.దీంతో 2021 మే 21న రఘురామకృష్ణంరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ను ఉన్నత న్యాయస్థానం ఇచ్చింది. సొంత పూచీకత్తు, ఇద్దరు జామీనుదారులతో, లక్ష రూపాయల షూరిటీ బాండ్లతో బెయిల్‌ తీసుకోవచ్చని తెలిపింది. 

సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసులో విచారణకు సహకరించాలని కూడా బెయిల్ సందర్భంగా కోర్టు సూచించింది. అయితే  ఈ కేసుల్లో విచారణకు హాజరు కావాలని కూడా ఎంపీ రఘురామకృష్ణం రాజుకు సీఐడీ అధికారులు సమాచారం పంపారు.  అయితే విచారణకు రఘురామకృష్ణంరాజు హాజరు కాలేదని సీఐడీ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ విషయమై విచారణకు హాజరు కావాలని కోరుతూ రఘురామకృష్ణంరాజుకు స్వయంగా నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు ఆయన ఇంటికి వచ్చారు. 

వైసీపీతో సంబంధాలు చెడిపోయిన రోజు నుండి రఘురామకృష్ణంరాజు నర్సాపురం నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. న్యూఢిల్లీ లేదా హైద్రాబాద్ కే ఆయన పరిమితమయ్యారు. అయితే సంక్రాంతిని పురస్కరించుకొని ఈ నెల 13న నరసాపురం వెళ్తానని రఘురామకృష్ణంరాజు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్న రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు రెండు దఫాలు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదుపై స్పీకర్ ఇంకా  చర్యలు తీసుకోలేదు. రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని వైసీపీ స్పీకర్ ను కోరుతుంది. అయితే తనపై అనర్హత వేటు వేయాలని కోరే నైతిక హక్కు వైసీపీకి లేదని రఘురామకృష్ణంరాజు  గతంలోనే చెప్పారు.

 


 

Follow Us:
Download App:
  • android
  • ios