మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. టీడీపీ జనరల్ సెక్రటరీ పేరుతో నోటీసులు ఇచ్చారు.
అమరావతి: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి ఈరోజు ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. టీడీపీ జనరల్ సెక్రటరీ పేరుతో నోటీసులు ఇచ్చారు. టీడీపీ ఆఫీసులో ఉన్న లాయర్‌ల చేతికి నోటీసులు అందజేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై చైతన్య రథంలో రాసిన కథనంపై ఈ నోటీసులు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అనుబంధ డిజిటల్ పేపర్ చైతన్య రథం కథనాలపై వివరాలను సేకరించారు. ఆ పత్రిక ఎడిటర్ ఎవరు?, నిర్వహణ ఎవరూ చూస్తున్నారనే వివరాలను ఆరా తీశారు.
