Asianet News TeluguAsianet News Telugu

రిటైర్డ్ ఐఎఎస్ అధికారి పీవీ రమేష్‌ కి ఏపీ సీఐడీ నోటీసులు ఈ నెల 22న విచారణకు రావాలని ఆదేశం

రిటైర్డ్ ఐఎఎస్ అధికారి పీవీ రమేష్ కు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 22న విచారణకు రావాలని సీఐడీ అధికారులు ఆ నోటీసులో పేర్కొన్నారు.

AP CID Issues notice to  Retired Ias officer PV Ramesh
Author
Hyderabad, First Published Jan 19, 2022, 11:53 AM IST

హైదరాబాద్: రిటైర్డ్ Ias అధికారి Pv Ramesh Kumar కు ఏపీ సీఐడీ అధికారులు బుధవారం నాడు నోటీసులు ఇచ్చారు. ఓ కేసు విషయంలో ఈ నెల 22న విచారణకు రావాలని పీవీ రమేష్ ఇంట్లో ఉన్న ఆయన పేరేంట్స్ కు నోటీసులు ఇచ్చారు సీఐడీ అధికారులు. ఏపీ సీఐడీ అధికారులు వచ్చిన సమయంలో పీవీ రమేష్ ఇంట్లో లేరు.

తెలంగాణలోని హైద్రాబాద్ కొండాపూర్ లోని పీవీ రమేష్ ఇంటికి ఇవాళ ఉదయం ముగ్గురు సీఐడీ అధికారులు వచ్చారు. 2013లో ఏపీ Cid చీఫ్‌ Sunil Kumar పై వేధింపులు, గృహహింస కింద ఆయన భార్య కేసు పెట్టారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో సునీల్‌కుమార్‌ను అరెస్ట్ చేయవద్దని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయిప్పటికీ.. తమపై కూడా గృహహింస కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని పీవీ రమేష్‌ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

ఇదిలా ఉంటే గత ఏడాది డిసెంబర్ 20 వ తేదీన కూడా పీవీ రమేష్ ఇంటికి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చేందకు వచ్చారు. హైద్రాబాద్ లోని ప్రశాసన్ నగర్ లోని పీవీ రమేష్ ఇంటికి సీఐడీ అధికారులు వెళ్లారు. అయితే ఆ ఇంటిని పీవీ రమేష్ డెవలప్ మెంట్ కు ఇచ్చి మరో ప్రాంతంలో పీవీ రమేష్ నివాసం ఉంటున్నారు. 

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ప్రధానంగా స్కామ్ కు పాల్పడిన సీమెన్స్ కంపెనీకి సహకరించిన అధికారుల పాత్రపై సీఐడీ విచారణ చేస్తోంది. అప్పటి చంద్రబాబు సర్కార్ ఈ పథకాన్ని అమలు చేస్తున్న సమయంలో పీవీ రమేష్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక శాఖ సెక్రటరీగా ఉన్నారు.  ఈ విషయమై విచారణ ఖోసం వచ్చినట్టుగా సీఐడీ అధికారులు చెప్పారు.అయితే ఆ సమయంలో పీవీ రమేష్ అందుబాటులో లేకపోవడంతో స్పీడ్ పోస్టులో ప్రశ్నలను పంపుతామని సీఐడీ అధికారులు తెలిపారు.

స్కిల్ డెవలప్ మెంట్ లో ఏం జరిగిందంటే?

రాష్ట్రంలో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఉద్యోగావకాశాలు పెంపొందించేందుకు ‘సీమెన్స్‌’ ప్రాజెక్టు రూపొందించారు. ఈ ప్రాజెక్టును సీమెన్స్‌ కంపెనీ తొలుత Gujarat లో అమలు చేసింది. అక్కడ మంచి ఫలితాలు రావడంతో అప్పటి Tdp ప్రభుత్వం కూడా ఆ సంస్థను ఆహ్వానించింది. సీమెన్స్‌-డిజైన్‌టెక్‌ సంస్థలు కలిసి రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ఒప్పందం చేసుకున్నాయి.  నైపుణ్యాభివద్ధి కోసం ఒక సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను నెలకొల్పారు. దానికింద ఐదు టెక్నికల్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేంద్రాలు నెలకొల్పారు. ఇలా ఒక సెంటర్‌, దాని పరిధిలో ఐదు టీఎస్డీఐల ఏర్పాటుకు అయ్యే ఖర్చు 546 కోట్లు. అందులో 90శాతం అంటే రూ.491కోట్లు సీమెన్స్‌-డిజైన్‌టెక్‌లు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా భరించినవే. కేవలం 10శాతం నిధులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.  

ఎలాంటి సాఫ్ట్ వేర్ ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా రికార్డులు సృష్టించారని సీఐడీ అధికారులు దర్యాప్తులో తేల్చారు.డిజైన్ టెక్ సంస్థ ద్వారా రూ.242 కోట్ల నగదు చేతులు మారినట్టుగా సీఐడీ అధికారులు నిర్ధారించారు. సీమెన్స్, డిజెన్స్ టెక్ సంస్థలు షెల్ కంపెనీలుగా వ్యవహరించాయనీ సీఐడీ అధికారులు నిర్ధారించారు.  

ముంబై, పుణెకు చెందిన షెల్ కంపెనీలు ఈ విషయంలో కీలకంగా వ్యవహరించినట్టుగా  సీఐడీ గుర్తించారు.  ఎలాంటి సాఫ్ట్ వేర్ ఇవ్వకుండానే సాఫ్ట్ వేర్  ఇచ్చినట్టుగా నకిలీ ఇన్ వాయిస్ లు సృష్టించారని కూడా సీఐడీ అధికారులు నిర్ధారించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios