ఏపీ ఫైబర్ నెట్‌కేసులో సీఐడీ దూకుడు: ఆస్తుల అటాచ్ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్

ఏపీ ఫైబర్ నెట్ కేసులో  ఏపీ సీఐడీ  మరింత దూకుడును పెంచింది. ఈ కేసు విషయమై ఏపీ సీఐడీ  ఏసీబీ కోర్టులో  మరో పిటిషన్ ను దాఖలు చేసింది.  

AP CId Files  Petition In ACB Court For attach Assets in AP Fibernet Case lns

విజయవాడ:ఏపీ ఫైబర్ నెట్ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్ కోరుతూ ఏపీ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో సోమవారంనాడు  పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ఫైబర్ నెట్ కేసులో  నిందితుల ఆస్తుల అటాచ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం  అనుమతిని ఇచ్చింది.  ఇటీవలనే  ఈ విషయమై  ఏపీ హోంమంత్రిత్వశాఖ  ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.  నిందితులకు  సంబంధించిన రూ. 114 కోట్ల ఆస్తులను  అటాచ్ చేయాలని  పిటిషన్ దాఖలు చేసింది.ఏపీ, తెలంగాణలో  మొత్తం  ఏడు చోట్ల ఆస్తుల అటాచ్ కు అనుమతి ఇవ్వాలని సీఐడీ అధికారులు ఆ పిటిషన్ లో కోరారు.  

టెరా సాఫ్ట్ కంపెనీ సహా  చంద్రబాబుకు చెందిన ఏడుగురి స్థిరాస్తులను  అటాచ్ చేయాలని సీఐడీ  ఏపీ హోంశాఖకు ప్రతిపాదనలను పంపింది.ఈ ప్రతిపాదలకు  ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది.  ఈ మేరకు  ఈ నెల  2న  ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 

ఏపీ ఫైబర్ నెట్ కేసులో  టీడీపీ చీఫ్ చంద్రబాబుపై  ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.  ఏపీ ఫైబర్ నెట్ లో  రూ. 114 కోట్లు దుర్వినియోగం అయినట్టుగా  కేసు నమోదు చేసింది సీఐడీ.  ఈ కేసులో  చంద్రబాబును ఏ 25గా  సీఐడీ చేర్చింది.  

ఈ కేసులో  వేమూరి హరికృష్ణను ఏ1గా  సీఐడీ చేర్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారుల  ఆస్తులను అటాచ్ చేయాలని  సీఐడీ భావిస్తుంది.ఈ మేరకు  ఏసీబీ కోర్టు అనుమతి కోరుతూ  ఇవాళ పిటిషన్ దాఖలు చేసింది.  ఈ పిటిషన్ పై ఏసీబీ కోర్టు  ఆదేశాలు ఎలా ఉంటాయనే  విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

నిందితులకు చెందిన  గుంటూరు, విశాఖపట్టణం, హైద్రాబాద్, రంగారెడ్డిలలోని వ్యవసాయ భూములు, ప్లాట్లను అటాచ్ చేసేందుకు అనుమతిని కోరుతూ  ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios