Asianet News TeluguAsianet News Telugu

నారాయణకు మరో షాక్: అమరావతి ల్యాండ్ పూలింగ్‌లో అవినీతిపై మరో కేసు

 మాజీ మంత్రి నారాయణపై మరో కేసు. నమోదైంది. అమరావతి ల్యాండ్ పూలింగ్ అవినీతిపై ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.

AP CID Files Case Against Former Minister Narayana Over Land pooling
Author
Guntur, First Published May 10, 2022, 1:17 PM IST | Last Updated May 18, 2022, 3:59 PM IST


హైదరాబాద్: మాజీ మంత్రి, టీడీపీ నేత Ponguru Narayana పై మరో కేసు నమోదైంది. Amaravathi  ల్యాండ్ పూలింగ్ కేసులో నారాయణపై మరో Case నమోదు చేశారు. అమరావతి ల్యాండ్ పూలింగ్ పై సోమవారం నాడే ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. అమరావతి ల్యాండ్ పూలింగ్ పై మంగళగిరి ఎమ్మెల్యే Alla Ramakrishna Reddy ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ల్యాండ్ పూలింగ్ కేసులో ఏ-1 గా చంద్రబాబు, ఏ-2 గా నారాయణ, ఏ-3 గా లింగమనేని రమేష్, ఏ-4 గా లింగమనేని శేఖర్ లను ఎఫ్ఐఆర్ లో చేర్చింది సీఐడీ. ఏ-5 గా అంజనీకుమార్, ఏ-6 గా హెరిటేజ్ ఫుడ్స్  సహా 14 మంది పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చింది సీఐడీ.ఈ  విషయమై 120బీ, 420, 34, 36,37, 166 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో అవకతవకలు జరిగినట్టుగా ఫిర్యాదు అందింది. 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగినట్టుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి  పిర్యాదు చేశారు. అలైన్ మెంట్ మార్పుతో రామకృష్ణ హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ పామ్స్, , జయని ఎస్టేట్స్ కు లబ్ది కల్గించారని ఆరోపణలున్నాయి. 454 కి.మీ పాటు ఇన్నర్ రింగ్ రోడ్డునున నిర్మించాలని తలపెట్టారు. కేంద్రం అనుమతితో అన్ని ప్రాంతాలను కలిపేలా ఇన్నర్ రింగ్ రోడ్డు  నిర్మాణానికి చేపట్టారు. రాజధానికి వెలుపల లింగమనేని, హెరిటేజ్, జయని ఇన్ ఫ్రా భూములున్నాయి.గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు వద్ద హెరిటేజ్ ఫుడ్స్ భూములున్నాయి. 

నారాయణను ఇదే కేసులో పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా చెబుతున్నారు. టెన్త్ క్లాస్ ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో నారాయణను అరెస్ట్ చేసినట్టుగా తొలుత ప్రచారం సాగింది. ఆ తర్వాత అమరావతి ల్యాండ్ పూలింగ్ అవినీతి కేసులో అరెస్ట్ చేశారని చెబుతున్నారు.

గతంలో అమరావతి భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఈ విషయమై సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను  కొట్టివేయాలని చంద్రబాబు సహా పలువురు ఏపీ హైకోర్టులో 2021 మార్చి 18న పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి భూ కుంభకోణంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించి కేసుకు హైకోర్టు కొట్టివేసిన నెల రోజుల తర్వాత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా సీఐడీ నివేదిక అందించింది. అయితే చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఈ విషయమై సుప్రీంకోర్టును కూడా ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios