ఫైబర్ నెట్ స్కాం : బుధవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయం.. ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సీఐడీ

ఫైబర్ నెట్ స్కాంలో కేసులో ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ మెమో దాఖలు చేసింది. బుధవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయడం లేదని న్యాయస్థానానికి తెలియజేస్తూ మెమో దాఖలు చేసింది. 

ap cid filed memo in acb court in fiber net scam ksp

ఫైబర్ నెట్ స్కాంలో కేసులో ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ మెమో దాఖలు చేసింది. బుధవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయడం లేదని న్యాయస్థానానికి తెలియజేస్తూ మెమో దాఖలు చేసింది. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా ఇప్పుడే చంద్రబాబును అరెస్ట్ చేయబోమని సీఐడీ లాయర్లు న్యాయస్థానానికి తెలిపారు. అత్యున్నత న్యాయస్థానానికి ఇచ్చిన హామీ మేరకు ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. అలాగే సోమవారం చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరుపరచనుంది సీఐడీ. 

కాగా.. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. చంద్రబాబు తరపున సిద్ధార్ధ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురికి ముందస్తు బెయిల్ వచ్చిందని, ఇద్దరికి రెగ్యులర్ బెయిల్ వచ్చిందని ఆయన వాదించారు. అలాంటప్పుడు తన క్లయింట్‌కు ఎందుకు ఇవ్వడం లేదని లూథ్రా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్కిల్ స్కాంలో చంద్రబాబుకు 17ఏ వర్తిస్తే.. ఫైబర్‌నెట్ కేసులోనూ వర్తిస్తుందని పేర్కొంది. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ.. విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. 

Also Read: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ , ఏపీ ఫైబర్ నెట్ కేసులు: చంద్రబాబు పిటిషన్లపై విచారణ ఈ నెల 17కి వాయిదా

మరోవైపు.. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ఏ 25గా వున్నారని విచారణకు అనుమతించాలని సీఐడీ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిని అనుమతించిన న్యాయస్థానం వచ్చే సోమవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు వ్యక్తిగతంగా కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios