Asianet News TeluguAsianet News Telugu

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు:చంద్రబాబుకు ముగిసిన రెండు రోజుల సీఐడీ కస్టడీ


ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు రెండు రోజుల సీఐడీ కస్టడీ ఆదివారం నాడు ముగిసింది. 

AP CID Custody Completes  To Chandrababunaidu   in AP Skill Development case lns
Author
First Published Sep 24, 2023, 5:06 PM IST

రాజమండ్రి: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు రెండు రోజుల సీఐడీ కస్టడీ ఆదివారంనాడు సాయంత్రంతో ముగిసింది.ఈ నెల 22వ తేదీన  ఏపీ సీఐడీ కస్టడీకి రెండు రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది ఏసీబీ కోర్టు. దీంతో ఈ నెల  23, 24 తేదీల్లో సీఐడీ అధికారులు  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును విచారించారు.

ఈ నెల  23న ఏడు గంటల పాటు చంద్రబాబును విచారించారు.  ఇవాళ ఉదయం నుండి సాయంత్రం వరకు  బాబు విచారించారు. శనివారం నాడు ఏడు గంటల పాటు  50 ప్రశ్నలు అడిగారు. ఇవాళ మరో 70 ప్రశ్నలు అడిగినట్టుగా సమాచారం.  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీఐడీ అధికారులు తాము సేకరించిన డాక్యుమెంట్ల ఆధారంగా  చంద్రబాబును రెండు రోజుల పాటు  సమాచారం సేకరించారు.    షెల్ కంపెనీలకు నిధుల విషయమై కూడ సీఐడీ అధికారులు చంద్రబాబును  ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది.

సీఐడీ డీఎస్పీ ధనుంజయ్ ఆధ్వర్యంలో  సీఐడీ అధికారులు చంద్రబాబును రెండు రోజుల పాటు విచారించారు.చంద్రబాబు విచారణను  సీఐడీ అధికారులు వీడియో తీయించారు. 
సీఐడీ విచారణకు ముందు, విచారణ తర్వాత  చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సీఐడీ అధికారులను  ఏసీబీ కోర్టు ఆదేశించింది.  కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు విచారించారు.  ఇవాళ విచారణ పూర్తైన తర్వాత చంద్రబాబును  ఏసీబీ కోర్టు ముందు  వర్చువల్ గా హాజరు పర్చారు.  ఇదిలా ఉంటే చంద్రబాబును మరో మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని  ఏసీబీ కోర్టులో  సీఐడీ పిటిషన్ దాఖలు చేసే యోచనలో ఉందని సమాచారం.

also read:రాత్రి తర్వాత తెల్లారుతుంది... చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా ట్వీట్ వైరల్

ఈ నెల 9వ తేదీన చంద్రబాబును  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో  సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఈ నెల  22వ తేదీతో రిమాండ్ పూర్తైంది. అయితే  ఈ నెల 22న రిమాండ్ ను రెండు రోజుల పాటు ఏసీబీ కోర్టు పొడిగింది. రిమాండ్ ఇవాళ్టితో పూర్తి కానుంది.దీంతో రిమాండ్ ను కూడ  పొడిగించాలని సీఐడీ ఏసీబీ కోర్టును కోరుతుంది.30 అంశాలపై చంద్రబాబును  సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏం జరిగిందనే  విషయమై బాబు నుండి రాబట్టేందుకు  సీఐడీ అధికారులు ప్రయత్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios