Asianet News TeluguAsianet News Telugu

రఘరామకృష్ణంరాజు‌ కేసు: ముగ్గురితో మెడికల్ బోర్డు ఏర్పాటు చేసిన సీఐడీ కోర్టు

 నర్పాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు  కేసులో మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది సీఐడీ కోర్టు. గుంటూరు  ప్రభుత్వాసుపత్రి సూపరింటెండ్ ప్రభావతిని మెడికల్ బోర్డు హెడ్‌గా నియమించింది కోర్టు. 

AP CID court appoints Medical board for MP Raghu Rama Krishnam Raju case lns
Author
Guntur, First Published May 16, 2021, 1:47 PM IST

గుంటూరు: నర్పాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు  కేసులో మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది సీఐడీ కోర్టు. గుంటూరు  ప్రభుత్వాసుపత్రి సూపరింటెండ్ ప్రభావతిని మెడికల్ బోర్డు హెడ్‌గా నియమించింది కోర్టు. ఈ కమిటీలో  మరో ముగ్గురిని సభ్యులుగా నియమించింది న్యాయస్థానం. హెడ్ ఆఫ్ ది జనరల్ మెడిన్ డాక్టర్ నరసింహం, ఆర్థోపెడిక్ డాక్టర్ వరప్రసాద్, జనరల్ సర్జన్ సుబ్బారావులు వీరిలో ఉన్నారు. 

alsop read:మా నాన్నను కొట్టిచిత్రహింసలు పెట్టారు: మోడీ, ఓంబిర్లాకు ఎంపీ రఘురామకృష్ణంరాజు కొడుకు భరత్ లేఖలు

పోలీసులు తనను చిత్రహింసలు పెట్టారని తీవ్రంగా కొట్టారని ఎంపీ రఘురామకృష్ణంరాజు  కోర్టుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై  ఎంపీ రఘురామకృష్ణంరాజుకు 18 రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. రెండు ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహించాలని  కోర్టు ఆదేశించింది. ఈ రెండు ఆసుపత్రుల్లోని నివేదికలను పరిశీలించాలని ఆదేశించింది.  ఈ మేరకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. 

రఘురామకృష్ణంరాజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేశారనే నెపంతో ఈ నెల 14వ తేదీ సాయంత్రం సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 14వ తేదీన పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని ఎంపీ కోర్టుకు తెలిపారు. అంతేకాదు  తనను చిత్రహింసలకు గురి చేశారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  


 

Follow Us:
Download App:
  • android
  • ios