Asianet News TeluguAsianet News Telugu

అగ్రిగోల్డ్ కుంభకోణం: రూ.100 కోట్ల ఆస్తుల్ని జప్తు చేయనున్న సీఐడీ

అగ్రిగోల్డ్ కుంభకోణంలో సీఐడీ వేగం పెంచింది. బాధితుల నుంచి నిరసనలు ఎక్కువ కావడంతో పాటు ప్రభుత్వం సైతం ఈ దిశగా దృష్టిపెట్టడంతో సీఐడీ కూడా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో అగ్రిగోల్డ్ యజమానుల బినామీలకు చెందిన 151 ఆస్తులను సీఐడీ గుర్తించింది. 

AP CID Attach agrigold assets worth Rs.100 crores
Author
Vijayawada, First Published Jan 25, 2019, 9:33 AM IST

అగ్రిగోల్డ్ కుంభకోణంలో సీఐడీ వేగం పెంచింది. బాధితుల నుంచి నిరసనలు ఎక్కువ కావడంతో పాటు ప్రభుత్వం సైతం ఈ దిశగా దృష్టిపెట్టడంతో సీఐడీ కూడా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో అగ్రిగోల్డ్ యజమానుల బినామీలకు చెందిన 151 ఆస్తులను సీఐడీ గుర్తించింది.

వీటి మార్కెట్ విలువ రూ.100 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఈ ఆస్తులన్నీ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, విశాఖ జిల్లాల్లోనే ఉన్నట్లుగా తేలింది. ఈ ఆస్తులను జప్తుచేయటానికి సీఐడీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

గతంలోనే అగ్రిగోల్డ్‌కు చెందిన ఆస్తులను ఈ-వేలం ద్వారా అమ్మేందుకు ప్రభుత్వం అనుమతినివ్వగా.. తాజాగా ఈ 151 ఆస్తులను సైతం ఆ జాబితాలోకి చేర్చాలని సీఐడీ భావిస్తోంది. మరోవైపు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ వైసీపీ సహా ప్రధాన ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోన్న నేపథ్యంలో సీఐడీ దూకుడు ప్రాధాన్యత సంతరించుకుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios