బదిలీలకు ఏపీజీఈఏ ఆఫీస్ బేరర్స్ లేఖలు: విచారణకు సీఎస్ ఆదేశం
సాధారణ బదిలీల విషయమై ఉద్యోగ సంఘం ఆఫీస్ బేరర్స్ లేఖలు ఇచ్చే విషయమై విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి విచారణకు ఆదేశించారు.
అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశించారు. సాధారణ బదిలీల్లో మినహాయింపునకు నకిలీ ఆఫీస్ బేరర్స్ లేఖలను ప్రభుత్వానికి సమర్పిస్తున్నట్టుగా ఫిర్యాదులు అందాయి. ఈ విషయమై విచారణకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై వాస్తవాలు తేలేవరకు ఈ సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవద్దని సీఎస్ ఆదేశించారు. నకిలీ ఆఫీస్ బేరర్ లేఖలు జారీ చేస్తుందని ఏపీజీఈఏ పై ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఎస్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. వివిధ విభాగాల ఉద్యోగులకు ఏపీజీఈఏ నకిలీ లేఖలు అందినట్టుగా ప్రభుత్వం అనుమానిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నాయి. ఈ విషయమై ఇటీవలనే ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేశారు. బదిలీల విషయంలో ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్లకు కొన్ని మినహాయింపులున్నాయి. దీంతో ఈ విషయాన్ని ఆసరా చేసుకుని బదిలీల నుండి మినహాయింపుల కోసం ఉద్యోగుల సంఘం ఆఫీస్ బేరర్స్ లేఖనుల ఉపయోగిస్తున్నారు.ఈ విషయమై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.