నీతి ఆయోగ్ సమావేశం:కేంద్రం తీరును తప్పుబట్టిన బాబు, అడ్డుకొన్న రాజ్‌నాథ్ సింగ్

Ap Chandrababu naidu demands to fulfill bifurcation promises in Niti aayog meeting
Highlights

నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్రాన్ని ఏకేసిన బాబు


న్యూఢిల్లీ: ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలను నెరవేర్చడంలో కేంద్రం వైఫల్యం చెందిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించారు. అయితే బాబు ప్రసంగాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అడ్డుకొన్నారు. ఆదివారం నాడు రాష్ట్రపతి భవన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరిగింది.

నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సుమారు  20 నిమిషాల పాటు చంద్రబాబునాయుడు ప్రసంగించారు. అయితే బాబు ప్రసంగం 7 నిమిషాలు దాటిన తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అడ్డుకొన్నారు. అయినా బాబు తాను చెప్పాల్సిన అంశాలను బాబు ఈ సమావేశంలో ప్రస్తావించారు.

 

సుమారు 16 పేజీల ప్రసంగపాఠాన్ని చదివి విన్పించారు. ఏపీకి ప్రత్యేక పరిస్థితుల్లో ఉందని బాబు తాను చెప్పాలనుకొన్న అంశాలను ఈ సమావేశంలో ప్రస్తావించారు.ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పిన అంశాలపై బెంగాల్ సీఎం మమత బెనర్జీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడ సమర్ధించారు. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఈ రెండు రాష్ట్రాల సీఎంలు కేంద్రాన్ని కోరారు. అదే విదంగా తమ రాష్ట్రాలకు కూడ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వారు తమ రాష్ట్రాల గురించి ప్రస్తావించారు.

నీతి ఆయోగ్ సమావేశంలో అక్షర క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తొలుత ప్రసంగించారు. ఏపీలో నెలకొన్న సమస్యలపై బాబు ఈ సమావేశంలో ప్రస్తావించారు. విభజన సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబునాయుడు కేంద్రాన్ని కోరారు. ప్రత్యేక హోదాతో పాటు, విభజన హమీలను అమలు చేయడంలో కేంద్రం వైఫల్యం చెందిందన్నారు. 


పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులను కేంద్రం సమకూర్చడం లేదని ఆయన ఆరోపించారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం నిదులను కేంద్రం సమకూర్చడం లేదన్నారు. రెవిన్యూలోటును భర్తీ చేస్తామని కేంద్రం గతంలో ఇచ్చిన హమీని నెరవేర్చలేదని బాబు ఈ సమావేశంలో కేంద్రం వైఖరిపై మండిపడ్డారు.

రాష్ట్రాల ప్రయోజనాలకు జీఎస్టీ విఘాతం కలిగిస్తోందని బాబు చెప్పారు. స్థానికంగా పన్నులను విధించే వెసులుబాటును కల్పించేందుకు అవకాశం కల్పించాలని బాబు కేంద్రాన్ని కోరారు. 2011 జనాభా లెక్కలతో 15వ ఆర్ధిక సంఘం నిదులను కేటాయించకూడదని బాబు కోరారు. ఇదే రకంగా నిధులను కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు.

 

చంద్రబాబునాయుడు ప్రసంగం 7 నిమిషాల పూర్తైన తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  బాబు ప్రసంగానికి అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. ఒక్క నిమిషం మాత్రమే సమయం ఉందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. అయితే ఏపీ ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితుల్లో ఉందన్నారు. ఈ తరుణంలో తాను చెప్పాలనుకొన్న అంశాలను బాబు సమావేశంలో ప్రస్తావించారు. రాజ్‌నాథ్ అడ్డుకోవాలని ప్రయత్నించిన తాను మాత్రం తన ప్రసంగం పూర్తయ్యేవరకు వదల్లేదు.16  పేజీల ప్రసంగాన్ని పూర్తి చేసిన తర్వాత బాబు తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.


ఆ  నలుగురు సీఎంలతో మోడీ మాటా మంతీ

నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభానికి ముందు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం కుమారస్వామి, బెంగాల్ సీఎం మమత బెనర్జీలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.నీతి ఆయోగ్ సమావేశం హల్‌లోకి రాగానే ఇతర సీఎంలకు పీఎం మోడీ అభివాదం చేశారు. ఈ నలుగురు సీఎంలు ఒకేచోట కూర్చొన్నారు. అయితే మోడీ వీరి వద్దకు వచ్చి వారిని స్వయంగా పలకరించారు. వారితో కరచాలనం చేశారు. తనతో పాటు ఈ నలుగురు సీఎంలను సమావేశం హాల్ లోకి తీసుకెళ్ళారు.


 

 


 

loader