అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది సెలవుపై  వెళ్లారు. ఈ నెల 11వ తేదీ నుండి ఈ నెల 15వ తేదీ వరకు ఆయన సెలవుపై వెళ్లనున్నారు. ఈ నెల 16వ తేదీన ఆయన తిరిగి విధుల్లో చేరుతారు.

ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఎన్నికల సమయంలో  బిజీ బిజీగా ఉన్నారు. ఈ నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి,. దీంతో ఈ నెల 16న ద్వివేది విధుల్లో జాయిన్ కానున్నారు. 

ఈ నెల 14వ తేదీన నిర్వహించ తలపెట్టిన ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించిన ఎజెండాను కూడ ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. కేంద్ర ఎన్నికల సంఘం నుండి గ్రీన్ సిగ్నల్ ఇస్తే కేబినెట్ సమావేశం జరగనుంది.