ఆంధ్రప్రదేశ్ భూపరిపాలన చీఫ్ కమీషనర్ (సీసీఎల్ఏ) నీరభ్ కుమార్‌ ప్రసాద్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాల్సిందిగా సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

అలాగే జలవనరుల శాఖ స్పెషల్ సీఎస్ ఆదిత్యానాథ్ దాస్‌కు సీసీఎల్‌ఏగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. దీనితో పాటే అటవీ, పర్యావరణ శాఖ బాధ్యతలు కూడా ఆదిత్యనాథ్ దాస్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.