అంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి...

రామవరప్పాడు కళ్లెం వారి వీధిలో వివాహిత హత్య

విజయవాడ సమీపంలోని రామవరప్పడు కళ్లెం వారి వీధిలో పువ్వడా సత్య కల్యాణి(33)అనే వివాహితను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఒంటి పై ఉన్న ఆభరణాలు, వెహికల్ ను దుండగులు ఎత్తుకెళ్లిన ట్దు పోలీసులు తెలిపారు. క్లూస్ టీం రంగంలోకి దిగిందని,తెలిసిన వారి పనా లేక దొంగల పనా అణా కోణంలో విచారిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని ఏసీపీ సత్యానందం పరిశీలించారు. ఈ ప్రాంతంలో కళ్యాణి కుటుంబం 11 నెలలు గా అద్దెకు ఉంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు.ఇంట్లో మద్యం బాటిల్స్ ఉన్నాయని , ప్రత్యేక బృందాలు నిందితులను అచూకి కోసం గాలిస్తున్నాయని పోలీసులు చెప్పారు.

అంతా కలసి నన్ను ఇరుకున పెట్టారు, బాబు బాధ

పరిటాల శ్రీరాం పెళ్లికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనంత‌పురం వ‌చ్చిన‌ప్పుడు తెలుగుదేశం నేతలు సంయమనం పాటించకపోవడం పట్ల ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కెసిఆర్, టిడిపి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తో సమావేశం కావడం ఒక రాజకీయ వివాదంగా మారేందుకు తెలుగుదేశం నేతలు తొంద‌ర‌ప‌డి ప్ర‌వ‌ర్తించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రోజు అమరావతిలో జరిగిన తెలుగుదేశం సమన్వయకమిటీ సమావేశంలో ఆయన కెసిఆర్-కేశవ్ అ సమావేశం మీద మంత్రులకు కాస్ పీకారు. ఒక పొరుగు రాష్ర్ట ముఖ్య‌మంత్రి వ‌చ్చిన‌ప్పుడు గౌర‌వంగా ఆయ‌న్ని పంపాలని అన్నారు, అంతకు మించి శ్రుతి మించరాదని అన్నారు. ప‌య్యావుల కేశ‌వ్ తో ర‌హ‌స్య మంత‌నాలంటూ గంద‌ర‌గోళం సృష్టించడంపై మండిప‌డ్డారు. ఇవ‌న్నీ పార్టీకి ఏ మేర అవ‌స‌ర‌మో ప్ర‌తిఒక్క‌రూ ఆలోచించాలని హిత‌వు ప‌లికారు. అంతేకాదు, వెంకటాపురంలో పెళ్లికి వచ్చిన ప్రజలు కెసి ఆర్ ఎగబడటం కూడా చంద్రబాబును ఇబ్బంది పెట్టిందని, దీని వల్ల కెసిఆర్ ఆంధ్రలో బాగా ఫ్యాన్స్ ఉన్నారనే చర్చ మొదలయిందని ఆయన అభిప్రాయపడుతున్నారని ఒక మంత్రి తెలిపారు.

ఎంపిల రాజీనామా చివరి అస్త్రం, జగన్ క్లారిటీ

తన పాదయాత్ర కొనసాగుతుందని వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. అంతేకాదు,ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకోసం ఎంపిలతో రాజీనామా చేయించే విషయం విరమించుకోలేదని, అది చివరి అస్త్రమని అన్నారు. ఈ రోజు అనంతపురంలో పార్టీ ‘యువభేరి’ లో ప్రసంగిస్తూ ఆయన ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు. ప్రతిశుక్రవారం తప్పని సరిగా హైదరాబాద్ లోని సిబిఐ కోర్టుకు హాజరుకావలసి ఉన్నందున ఆయన యాత్ర కొనసాగుతుందా లేద అనే అనుమానం కూడా ఉండింది. అయితే యాత్ర వల్ల కోర్టుకు హాజరుకావడానికి మినహయింపు ఇవ్వాలన్న అభ్యర్థన కోర్టు పరిశీలనలో ఉంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం నవంబర్‌ 2 నుంచి పాదయాత్ర చేపడతానన్నారు. ఈ యాత్రను ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు నిర్వహిస్తామన్నారు.ఆరు నెలల పాటు యాత్ర కొనసాగుతుందని మొత్తొ మూడు వేల కిలోమిటర్లు యాత్ర సాగుతుందని అన్నారు. పాదయాత్రలో హోదాకు మద్దతు కూడగడతానన్నారు. చివరి అస్త్రంగా ఎంపీలతో రాజీనామా చేయిస్తామన్నారు.

విజయవాడ నారాయణ కాలేజీ విద్యార్థుల మధ్య గొడవ

విజయవాడ బెంజిసర్కిల్ నారాయణ జూనియర్ కాలేజీలో రెండు బ్యాచ్ ల విద్యార్థుల కొంత కాలంగా జరుగుతున్న గొడవ పెద్ద పంచాయతీ అయి కూర్చుంది. బ్లేడ్ లతో చంపేస్తామంటూ నిత్యం ఇంటికి ఫోన్లు చేసి ఒక బ్యాచ్ విద్యార్థులు బెదిరిస్తున్నారని మరొక బ్యాచ్ అరోపణ. తల్లిదండ్రుల ఫిర్యాదు ఈ పంచాయతీ త్రీ టౌన్ పోలీస్టేషన్ కు చేరింది. ల్లిదండ్రుల ను కాలేజీ వద్దకు తీసుకు వచ్చి పోలీసులు. తగవు తీర్చే పనిలో పడ్డారు.కాలేజీ సీసీ కెమెరాల్లో గొడవ దృశ్యాలు రికార్డయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడెమీ భవనం ప్రారంభం

విజయవాడ లో ఏపీ ప్రెస్ అకాడమీ నూతన భవనాన్ని సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత్రికేయ రంగంలోని సాధక బాధకాలు పై పూర్తి అవగాహన ఉన్న ప్రముఖ సంపాదకుడు వాసుదేవ దీక్షితులు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఉన్న సమయం లో ఈ నూతన భవనాన్ని ప్రారంభించడం తన అదృష్టం అని మంత్రి అన్నారు.అలాగే తమ ప్రభుత్వం జర్నలిస్టులకి అత్యంత గౌరవం ఇచ్చే ప్రభుత్వం అనీ..విధి నిర్వహణ లో పాత్రికేయులు ఎదుర్కొనే అన్ని రకాల సమస్యల పరిష్కారంలో ప్రెస్ అకాడమీ వెన్నుదన్నుగా నిలుస్తుంది అని మంత్రి అన్నారు. ఇటీవల జిల్లా మినీల్లో ప్రమాణాలు తగ్గుతున్నాయని ....ఎవరిమీద నయినా ఆరోపణలు చేసేటప్పుడు పూర్తి నిజాలతో విమర్శ చెయ్యాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఐ&పీఆర్ కమీషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాత్రికేయులు ఎలాంటి సహాయం అవసరమయినా ప్రెస్ అకాడమీ అందుబాటులో ఉంటుందని అని అన్నారు. ఇక ప్రెస్ అకాడమీ చైర్మన్ వాసుదేవ దీక్షితులు మాట్లాడుతూ ...ఏపీ లో తొలి ప్రెస్ అకాడమీ కి తొలి చైర్మన్ గా తాను నియామకం కావడం.. ప్రెస్ అకాడమీ భవనం తన హయాం లో ప్రారంభోత్సవం జరుపుకోవడం తన అదృష్టం అని అన్నారు. అలాగే .. గ్రామీణ జర్నలిస్టు లే గ్రౌండ్ రియాల్టీ ని ప్రజలకు అందించగలరని..వారికి వెన్నుదన్నుగా తాము నిలుస్తామని అన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి పాత్రికేయులు కొంత అండగా నిలవాల్సిన అవసరం ఉందనీ.. డెవలప్మెంట్ జర్నలిజం అవసరం రాష్ట్రానికి ఉందనీ.. అలాగని భజన చెయ్యడమే జర్నలిజం కాదని ఆయన అన్నారు.కేరళ..గుజరాత్ ..రాష్ట్రాల అభివృద్దిలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉంది.రాష్ట్రంలో జర్నలిస్టు లకి ఎలాంటి ఆపద వస్తున్నా వారికి రక్షణగా నా తల

పోలీస్ కస్టడీ నుంచి నిందితుడి పరారీ....

కృష్ణాజిల్లా పెనమలూరు పోలీసు స్టేషన్ నుండి ఒక నిందితుడి పరారయ్యాడు. సాయిసుమ అనే మహిళ మిస్సింగ్ కేసులో శ్రీధర్ అనే వ్యక్తి ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. విచారణ సమయంలో నే పోలీసుల కళ్ళు కప్పి స్టేషన్ నుండి శ్రీధర్ పరారయ్యాడు. అతగాడి కోసం కోసం పోలీసులు ఉరుకులు పరుగులు తీశారు. అయినా దొరకలేదు. దీనితో సాయిసుమ బంధువులు ఆందోళన తీవ్రమయింది.

అమరావతిలో టిడిపి సమన్వయ కమిటీ సమావేశం

అంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి సచివాలయంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం మొదలయింది.. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంపై చర్చిస్తున్నారు. ప్రజల నుంచి అందుతున్న సమస్యలు, ఫిర్యాదులు-పరిష్కారాలే ప్రధాన అజెండాగా సమావేశం జరుగుతోంది. ఇంటింటికి తెలుగుదేశం అమలు తీరును సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అన్ని జిల్లాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

రాయలసీమకు ఈ సారి భారీ వర్షాలు

రాయలసీమ మొత్తం విపరీతంగా వానలు కురుస్తున్నాయి. ఈసారి మొత్తం దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా వర్షపాతం నమోదయిన ప్రాంతం రాయలసీమ అయింది. మామాలుగా రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలలో కాలుమోపేది రాయలసీమ లోనే . అయితే, అక్కడే వర్షాలు అరుదు. ఇపుడు రుతు పవన వర్షాలతో కర్నూలు, కడప , అనంతపురం జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి.

కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీ వ‌ర్షం కురుస్తోంది. వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. గానెగండ్ల మండ‌లంలో కురిసిన కుండ‌పోత‌ వ‌ర్షానికి గాజుల‌దిన్నె సంజీవ‌య్య‌సాగ‌ర్ లో భారీగా వ‌ర‌ద‌నీరు వ‌చ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు నీటి మ‌ట్టం 365.5 అడుగుల‌కు చేరింది. ఎమ్మిగ‌నూరు మండ‌లంలో కురిసిన వ‌ర్షానికి సోగ‌నూరు వాగు ఉద్ధృతిగా ప్ర‌వ‌హిస్తోంది. పంట‌పొలాలు నీట‌మునిగాయి. దీంతో దిగువ ప్రాంత ప్ర‌జ‌ల‌ను అధికారులు అప్ర‌మ‌త్తం చేశారు. వ‌క్కెర వాగు ఉద్ధృతితో ప‌లు ప్రాంతాల‌కు రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. నందికొట్కూరులో హాజీన‌గ‌ర్ , మారుతిన‌గ‌ర్ లో ఇళ్ల‌లోకి వ‌ర్ష‌పునీరు చేర‌డంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. అవుకు మండ‌లం జూనూత‌ల చెరువుకు గండి ప‌డ‌టంతో పంట‌పొలాల్లోకి నీరు చేరింది. మిడ్తూర్ మండలంలో కందూన‌ది ఉద్ధృతికి నందికొట్కూరు – నంద్యాల మ‌ధ్య నిలిచిన రాక‌పోక‌లు నిలిచిపోయాయి.

అనంతపురం జిల్లా చిత్రావతి నదిలోకి భారీగా వరద నీరు ప్రవహిస్తున్నది.ది. జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అలాగే ఎగువన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో చిత్రావతి నదికి భారీగా వరద నీరు వస్తోంది. అలాగే భారీ వర్షాల కారణంగా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

కడప జిల్లాలోని అనేక ప్రాంతాల్లో మంగళవారం భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పులివెందుల, కొండాపురం, ప్రొద్దుటూరులో జమ్మలమడుగు, ముద్దనూరు మండలాల్లో కూడా భారీగా వర్షం కురుస్తోంది. జిల్లాలోని గంగాదేవిపల్లె చెరువు నిండి ప్రమాదకరస్థాయిలో ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అలాగే సింహాద్రిపురం మండలం బీసీ కాలనీలోకి వరద నీరు చేరింది. కొండాపురం మండలం చిన్నపల్లెలోకి తిమ్మాపురం చెరువు వరద నీరు రావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇక కొండాపురంలో భారీగా కురుస్తున్న వర్షాలకు పాతభవనం ఒకటి కూలిపోయింది. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి.

నక్సల్ రాష్ట్రాల డిజిపిల ‘రహస్య’ సమావేశం

నాలుగు నక్సల్ రాష్ట్రాల డీజీపీలు మంగళవారం ఉదయం ‘రహస్యం’గా సమావేశమయ్యారు. విజయనగరంలోని సన్‌ రే లో రిసార్టులో ఈ సమావేశం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల డీజీపీలు విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో గల ఈ ప్రైవేటు రిసార్టులో సమావేశమయ్యారు. సమావేశానికి బీఎస్‌ఎఫ్‌, సీఆర్పీఎఫ్‌, ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. నాలుగు రాష్ట్రాల సరిహద్దులలో మావోయిస్టుల కదలికలు, అణచివేత , తీర ప్రాంత భద్రత తదితర అంశాలపై డిజిపిలు చర్చిస్తున్నట్లు సమాచారం.

వర్షాలకు కుప్పకూలిక వంతెన

తూర్పుగోదావరి జిల్లా పుల్లేటికుర్రు పంచాయతీ పరిధిలో వ్యాఘ్రేశ్వరం అప్పర్ కౌశిక డ్రైన్‌పై ఉన్న వంతెన సోమవారం కురిసిన భారీ వర్షానికి కూలిపోయింది. సర్పంచ్‌ కాండ్రేగుల గోపాలకృష్ణ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వంతెనను 1979లో డ్రైయినేజీ శాఖ నిర్మించింది. దాదాపు 40 ఏళ్ల పాటు ఈ రెండు గ్రామాల వారికే కాక ఎంతో మంది బాటసారులకు, రైతులకు ఉపయోగపడింది. వంతెన కూలడంతో రాకపోకలు స్తంభించాయి. కూలిన సమయంలో వంతెనపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రభుత్వం కుప్పకూలిన వంతెన స్థానంలో కొత్త వంతెనను సత్వరం నిర్మించాలని గ్రామస్తులు కోరారు.