ఆంధ్ర ప్రదేశ్ లో రేపే నూతన మంత్రివర్గం కొలువుతీరనుంది. కొత్తగా మంత్రిపదవులు ఎవరికి దక్కుతాయనేది తెలుగుసుకునేందుకు అటు వైసిపి ఎమ్మెల్యేల, ఇతర రాజకీయ పక్షాలేే కాదు సామాన్యలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రుల ఫైనల్ లిస్ట్ ఒకటి బయటకు వచ్చింది. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ పునర్వ్యస్ధీకరణ సర్వం సిద్దమయ్యింది. ఇప్పటికే మంత్రులందరిచేత రాజీనామా చేయించిన జగన్ సర్కార్ నూతన మంత్రుల ప్రమాణస్వీకారానికి ఏర్పాటు చేస్తోంది. అయితే కొత్తగా ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయన్నదానిపై వైసిపి ఎమ్మెల్యేలు, రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్యుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే పాతజిల్లాల వారిగా చూసుకుంటే జగన్ కొత్త కేబినెట్ కూర్పు ఈ కిందివిధంగా వుండనుంది. ఫైనల్ లిస్ట్ కూడా ఇదేనంటూ కొత్త మంత్రుల లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

కేబినెట్ పైనల్ లిస్ట్ జిల్లాలవారిగా: 

విజయనగరం
1.బొత్స సత్యనారాయణ
2.రాజన్నదొర

శ్రీకాకుళం
3.ధర్మాన ప్రసాదరావు
4.సీదిరి అప్పలరాజు


విశాఖపట్నం
5.భాగ్యలక్ష్మి
6.గుడివాడ అమర్నాథ్


తూర్పుగోదావరి
7.దాడిశెట్టి రాజా
8.చిట్టి బాబు
9.వేణుగోపాల్


పశ్చిమ గోదావరి
10.కారుమూరి నాగేశ్వరరావు
11.గ్రంధి శ్రీనివాస్

కృష్ణా
12.జోగి రమేష్
13.కొడాలి నాని
14.రక్షణనిధి


గుంటూరు
15.విడదల రజని 
16.మేరుగు నాగార్జున


ప్రకాశం
17.ఆదిమూలపు సురేష్


నెల్లూరు
18.కాకాని గోవర్థన్ రెడ్డి


చిత్తూరు
19.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


కడప
20.అంజాద్ బాషా
21.కొరుముట్ల శ్రీనివాస్


కర్నూలు
22.శిల్పా చక్రపాణి రెడ్డి
23.గుమ్మనూరు జయరాం


అనంతపురం
24.జొన్నలగడ్డ పద్మావతి
25.శంకర్ నారయణ

చివరి క్షణంలో ఏమైనా మార్పులు జరిగితే పైని లిస్ట్ లో కొన్నిపేర్లు కనిపించకుండాపోయి కొత్తపేర్లు చేరతాయి. చిత్తూరు జిల్లాలో రోజాకు మంత్రిమండలిలో చోటుదక్కనుందని ప్రచారం జరిగింది. అయితే పైని లిస్ట్ ను బట్టి చూస్తే ఆమెకు ఈసారి కూడా అవకాశం దక్కేలా లేదు. అలాగే మంత్రి పదవులు ఆశించిన మరికొందరికి కూడా ఆశాభంగం తప్పేలా లేదు. 

ఇక ఇప్పటికే పాత మంత్రులందరు తమ రాజీనామా లేఖలను సీఎం జగన్ కు సమర్పించగా వాటిని ఆయన గవర్నర్ ఆమోదానికి పంపించారు. ఇవాళ(ఆదివారం) గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ రాజీనామాలకు ఆమోదం తెలపనున్నారు. గవర్నర్ ఆమోదం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించనుంది.

అలాగే కొత్త మంత్రుల లిస్ట్ ను కూడా సీఎం సీల్డ్ కవర్లో గవర్నర్ కు పంపనున్నట్లు... దీనికి కూడా నేడే గవర్నర్ ఆమోదం లభించే అవకాశం వుంది. సీఎం నిర్ణయించిన ఫైనల్ లిస్ట్ మరికొద్దిసేపట్లో గవర్నర్ ఆమోదానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్ లోని వారే రేపు(సోమవారం) మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సామాజిక సమీకరణలు, అనుభవం ఇలా వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని సీఎం జగన్ కొత్తమంత్రులను ఎంపిక చేసినట్లు పార్టీవర్గాలు చెబుతున్నారు. 

మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. నిన్నంతా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై చర్చించారు వైఎస్ జగన్. (ys ఇవాళ మరోసారి సజ్జలతో జగన్ భేటీకానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సజ్జలతో భేటీ తర్వాత సీఎం జగన్ మంత్రుల లిస్ట్ ను ఫైనల్ చేయనున్నారు.

మరోవైపు మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు వేగంగా చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసే మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అటు జీఏడీ కూడా పాస్‌లను సిద్దం చేసింది.