అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం బుధవారం నాడు ఉదయం పదకొండున్నర గంటలకు జరగనుంది.పలు కీలక అంశాలపై ఏపీ కేబినెట్ లో చర్చించనున్నారు. 

ఉదయం పదకొండున్నర గంటలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఏపీ మైనర్ మినరల్స్ కన్సెషన్ రూల్స్ లో సవరణలకు ఆమోదం తెలపనున్న కేబినెట్.ఇసుక అక్రమ తవ్వకాలు,రవాణపై భారీగా జరిమానాతో పటు రెండేళ్ల పాటు జైలు శిక్ష వేసేలా చట్ట సవరణ చేసే బిల్లుపై కేబినెట్ చర్చించనుంది.

Also read:ఇసుక రవాణాలో 67 మంది వైసీపీ నేతలు వీరే: టీడీపి జాబితా

ఈ నెల 14వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఇసుక వారోత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇసుక కొరత విషయమై విపక్షాలు చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో ఇసుక వారోత్సవాల నిర్వహణ విషయమై కూడ కేబినెట్ లో చర్చించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియం అమలుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

ఏపీ కాలుష్య నిర్వహణ సంస్థ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. పట్టణాల్లో అక్రమ లే అవుట్ల క్రమబద్దీకరణపై కూడ కేబినెట్‌లో చర్చించనున్నారు. గ్రామ న్యాయాలయాల ఏర్పాటు,అడ్వకేట్ల సంక్షేమ నిధిపై చర్చించనున్నారు.

Also read:పవన్, బాబు విమర్శలు: హైదరాబాద్ కు ఇసుక రవాణాకు జగన్ చెక్

ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు 10 లక్షల ఆర్థిక సాయం పెంపుకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. సింగపూర్ తో స్టార్టప్ ఏరియా రద్దుకు ఆమోదం తెలపనుంది. ఈ నెల 12వ తేదీ ఉదయమే ఏపీ ప్రభుత్వంతో స్టార్టప్ ఏరియా రద్దు చేసుకొంటున్నట్టుగా సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది.

ప్రభుత్వ భూముల అమ్మకాలు, బిల్డ్ ఏపీ పై కేబినెట్ లో చర్చించనున్నారు. ఆర్ధిక వనరుల కోసం భూములను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ విషయమై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. 

ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఈ నెల 14వ తేదీన 12 గంటల పాటు దీక్ష నిర్వహించనున్నారు. ఈ దీక్షకు సంబంధించి కూడ కేబినెట్ లో చర్చించనున్నారు.