అమరావతి: ఆంధప్రదేశ్ మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలపై ఆమోదముద్ర వేసింది. మంగళవారం ఉదయం 10.30గంటలకు సమావేశమైన మంత్రి మండలి అగ్రిగోల్డ్, అన్న క్యాంటీన్లు, కడప ఉక్కు కర్మాగారం వంటి కీలక నిర్ణయాలపై ఆమోద ముద్ర వేసింది. 

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 152 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చెయ్యాలని, అలాగే నూతనంగా అన్నా క్యాంటీన్ చారిటబుల్ ట్రస్టు ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశాఖ ల్యాండ్ పూలింగ్ విధానంలో మార్పులు చేర్పులకు అనుమతినిచ్చింది. 


రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణానినికి రూ.8,300కోట్లు వ్యయాన్ని అంచనా వేసింది. పిపిపి విధానములో చేపట్టేందుకు ఆమోదం తెలుపుతూ తీర్మానించింది. ప్రపంచంలోనే పిపిపి విధానంలో అతిపెద్ద రెండో ప్రాజెక్టుగా వైజాగ్ మెట్రోరైలు నిర్మాణం జరుగుతుందని అభిప్రాయపడింది. 

మూడు కారిడార్లలో 42.55 కిలోమీటర్ల మేర మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణం జరగనున్నట్లు తెలిపింది. గాజువాక-కొమ్మది 30 కిలోమీటర్లు, గురుద్వార- ఓల్డ్ పోస్ట్ ఆఫీసు 5.25 కి.మీటర్లు తాడిచెట్లపాలెం నుంచి చైనా వాల్తేరు 6.5 కి.మీ. మెుత్తం 42.55 కి.మీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణంపై కేబినేట్ లో చర్చ జరిగింది. 


అలాగే రాష్ట్రవ్యాప్తంగా 366 అన్న క్యాంటిన్ లు ఏర్పాటు చేయలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీలో 215, గ్రామీణ ప్రాంతాల్లో 152 ఏర్పాటు చేయలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 124 అన్న క్యాంటిన్ లు ఉండగా అదనంగా మరో152 అన్న క్యాంటిన్ లు గ్రామీణ ప్రాంతాలలో నిర్మించేందుకు ఏపి మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. 

అటు విశాఖ జిల్లాలో ల్యాండ్ రికార్డుల ట్యాంపరింగ్ కు సంబంధించి  సిట్ దర్యాపు  నివేదిక కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సిట్ నివేదిక సిఫార్సులు సాధ్యాసాధ్యాలపై కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 

రెవెన్యూ, న్యాయ శాఖల కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చెయ్యాలని తీర్మానించింది. పలువురు రాజకీయ నేతలు, అధికారులు రికార్డుల టాంపరింగ్ కు పాల్పడ్డారని సిట్ గుర్తించిన విషయంపై చర్చించింది. 

ఇకపోతే తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై విస్తృతంగా చర్చించింది. స్టీల్ ప్లాంట్ కు రూ.15 నుంచి 18 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 

బ్యాంకుల నుంచి రుణ సమీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. 3 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో ప్లాంట్ ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. ముడి ఖనిజ నిల్వలు ఉన్నందున రుణం మంజూరు అవుతుందని కేబినెట్ లో చర్చించారు.