AP cabinet meeting : ముగిసిన ఏపీ కేబినేట్ సమావేశం.. పలు కీలక అంశాలకు ఆమోదం..
ఏపీ సచివాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఏపీ కేబినేట్ సమావేశం ముగిసింది. ఇందులో పలు కీలక అంశాలకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది.

AP cabinet meeting : సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినేట్ సమావేశం కొద్ది సేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో 38 కీలక అంశాలకు కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. ఇందులో పలు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఎస్ఐపీబీ నిర్ణయాలను కేబినేట్ ఆమోదించింది. అలాగే
రాష్ట్రంలో కులగణన చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ నెల 15వ తేదీన కుల గణన ప్రారంభం కానుంది.
పార్టీ ఆదేశిస్తే కర్ణాటక సీఎం కావడానికి సిద్ధమే - మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే
దేవాలయాల ఆదాయ పరిమితులు ఆధారంగా కేటగిరీల్లో మార్పులకు చేసేందుకు అనుమతినిచ్చింది. జర్నలిస్టులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల కేటాయింపునకు ఆమోదం లభించింది. అలాగే టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ కు గ్రూప్ 1 పోస్ట్ ఇవ్వాలని నిర్ణయించింది.
భగవంతుడి దయతో బాగానే ఉన్న.. వారం రోజుల్లో ప్రజల్లోకి వస్తా - కొత్త ప్రభాకర్ రెడ్డి
ఉద్యోగులకు ఇటీవల ప్రకటించిన డీఏ కు కూడా ఏపీ కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఆర్డర్ డ్రాఫ్ట్ – 2023 కు కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రూ.19 వేల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులకు కూడా ఆమోదం తెలిపింది. జగనన్న విద్యా దీవెన మూడో విడత కు కూడా ఆమోద ముద్ర వేసింది.