అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం బుధవారం నాడు ఉదయం ప్రారంభమైంది. సచివాలయంలోని ఫస్ట్ బ్లాకులో జగన్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు.

పలు కీలకాంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సుమారు 20 అంశాలతో ఎజెండాను సిద్దం చేశారు.కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నారు.. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఇప్పటికే కొందరు ప్రజా ప్రతినిధుల నుండి నిరసన స్వరాలు రావడంతో కొత్త జిల్లా ఏర్పాటు విషయమై కమిటిని ఏర్పాటు చేసే ఆలోచన ఉందనే ప్రచారం సాగుతోంది.

శాండ్ కార్పోరేషన్ ఏర్పాటుపై కూడ మంత్రివర్గంలో చర్చిస్తారు. రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్ పాలసీపై కూడ కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.విద్యాశాఖలో నాడు నేడు కార్యక్రమంపై చర్చించనున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అభ్యర్థులను కూడ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది.
వివిధ శాఖల్లో కొత్త పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది కేబినెట్. 

మూడు రాజధానుల అంశాంతో పాటు ఇతర విషయాలపై కూడ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉందని సమాచారం. మరో వైపు కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కూడ చర్చించే అవకాశం లేకపోలేదు.