ఎన్నికలు ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం తొలి సమావేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సోమవారం జరగనుంది. 8 అంశాల అజెండాను సమావేశంలో చర్చించనున్నారు.

వృద్ధాప్య పింఛన్లు పెంచుతూ జగన్ తీసుకున్న నిర్ణయానికి క్యాబినెట్ సోమవారం ఆమోద ముద్ర వేయనుంది. దీనితో పాటు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, హోంగార్డుల జీతాలు పెంపుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇవ్వడంతో పాటు సీపీఎస్‌ను రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఆర్టీసీ విలీనం, వైఎస్సార్ రైతు భరోసాకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.